సాలీడు భయంతో నడుస్తున్న కారులోంచి దూకేసి.. !

23 Sep, 2015 20:29 IST|Sakshi
సాలీడు భయంతో నడుస్తున్న కారులోంచి దూకేసి.. !

ఇండియానా: బొద్దింకను, బల్లిని చూసి భయపడిపోయి గట్టిగా అరుస్తూ పారిపోయే మహిళలను చాలాసార్లు చూసి ఉంటాం. కానీ, నడుస్తున్న కారులోంచి అలాంటి భయంతో దూకేసిన మహిళలను చూడటం మాత్రం ఎప్పుడూ చూసి ఉండం. ఇండియానాలో మాత్రం ఓ మహిళ ఒక్కసారిగా తాను నడుపుతున్న కారు స్టీరింగ్ను వదిలేసి, కారులో ఉన్న కొడుకును మరిచిపోయి ఆ పనే చేసింది. ఏకంగా కారు నడుస్తుండగానే బయటకు దూకేసింది. అయితే అదృష్టం బాగుండి ఆ పిల్లాడు చిన్నపాటి గాయాలతో..  తృటిలో ప్రాణపాయం నుంచి తప్పించుకున్నాడు. అయితే ఆమె ఎందుకు అలా చేసిందో తెలుసా?...


సిరాక్యూజ్ చెందిన ఎంజెలా కిప్ (35) అనే మహిళ తన తొమ్మిదేళ్ల కొడుకుతో కారులో బయలుదేరింది. ఇంతలో ఆమె భుజంపై ఒక సాలీడు పాకుతుండటం గమనించింది. ఒక్కసారిగా ఆమె భయపడిపోయింది. అంతే ఏమాత్రం ఆలోచించకుండా స్టీరింగ్ ను వదిలేసి... కదులుతున్న కారులో నుంచి ఒక్క ఉదుటున బయటకు దూకేసింది. దీంతో షాకైన ఆ తొమ్మిదేళ్ల పిల్లాడు డ్రైవింగ్ సీటులోకి జంప్ చేసి బ్రేక్ పై కాలు వేయకుండా గ్యాస్ పెడల్ పై వేశాడు.

దీంతో కారు అదుపు తప్పి ఓ స్కూలు వ్యాన్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు నుజ్జు నుజ్జయినా ఆ బాలుడు మాత్రం స్వల్పగాయాలతో బయటపడ్డాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసు అధికారులు ఆ బాలుడిని ఆస్పత్రిలోకి చేర్చించారు. ప్రమాదానికి కారణమైన తల్లిని అదుపులోకి తీసుకుంటామని పోలీసులు తెలిపారు. ఇలా అతి చిన్న విషయాలకే అతిగా స్పందించడాన్ని ఆర్కానో ఫోబియా అంటారని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు.

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

హ్యూస్టన్‌లో నేడే హౌడీ మోదీ

గల్ఫ్‌కి మరిన్ని అమెరికా బలగాలు

భారత పర్యావరణ కృషి భేష్‌

విద్యతోపాటే వర్క్‌ పర్మిట్‌

డాలర్‌ సిరి.. హెచ్‌ 1బీ వీసా ఉంది మరి

భారత్‌పై ప్రశంసలు కురిపించిన ఐరాస

పాముతో పెట్టుకుంటే అంతే మరీ..

ఫ్యాన్స్‌ను ఆశ్చర్యపర్చిన యాపిల్‌ సీఈవో

మగాళ్లు షేర్‌ చేసుకోవడానికి ఇష్టపడరు..

46 పాక్‌ విమానాలు ఖాళీగా తిరిగాయి

2020లో అదే రిపీట్‌ అవుతుంది!

వేలాది ఫేక్‌ న్యూస్‌ అకౌంట్ల క్లోజ్‌

ఇరాన్‌పై అమెరికా కొత్త ఆంక్షలు

పిల్లల్ని కనే ప్రసక్తే లేదు..

ఐరాసలో కశ్మీర్‌ ప్రస్తావన!

హౌడీ మోదీకి వర్షం ముప్పు?

87 ఏళ్ల వయస్సులోనూ ఆమె ఇలా..

‘ఫేస్‌బుక్‌’ ఉద్యోగి ఆత్మహత్య

‘నా జీవితమే విషాదంలా మిగిలిపోయింది’

ట్రంప్‌తో జుకర్‌బర్గ్‌ భేటీ

అమెరికా ఆయుధ వ్యవస్థ అంత బలహీనమా?

‘హౌడీ మోదీకి రాలేకపోతున్నాను.. క్షమించండి’

2 మైళ్లు ప్రయాణించి.. తలలో ఇరుక్కుంది

వైట్‌హౌస్‌ సమీపంలో కాల్పుల కలకలం

జింగ్‌ జింగ్‌.. ఈ పాప తెలివి అమేజింగ్‌!

హౌడీ మోదీ కలిసొచ్చేదెవరికి

11 సెకన్లకో ప్రాణం బలి

టిక్‌... టిక్‌... టిక్‌

బుల్లెట్‌ రైళ్లలో విశేషాలెన్నో!

వైరల్‌: లైవ్‌లో కశ్మీర్‌పై చర్చిస్తుండగా...

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

ఆస్కార్స్‌కు గల్లీ బాయ్‌

నేడే సైరా ప్రీ–రిలీజ్‌ వేడుక

సంక్రాంతికి మంచివాడు

డేట్‌ ఫిక్స్‌

24 గంటల్లో...

అవార్డు వస్తుందా?