వియన్నాలో టూ వీలర్స్‌పై పూర్తి నిషేధం

25 Jun, 2020 11:49 IST|Sakshi

వియన్నా : ఆస్ట్రియా రాజధాని వియన్నా సిటీ సెంటర్‌లో అన్ని రకాల మోటారు సైకిళ్లను నిషేధించాలని అక్కడి ప్రభుత్వం నిర్ణయించింది. వియన్నాను మోటార్‌ సైకిల్‌ ఫ్రీ సెంటర్‌గా మార్చాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసకున్నారు. ఆస్ట్రియాలోనే అత్యధిక జనాభా కలిగిన వియన్నా ప్రాంతం యూరోప్‌ ఖండంలోనే  అద్భుతమైన రహదార్లను కలిగి ఉండి టూ వీలర్‌ ప్రయాణాలకు అనువుగా ఉంటుంది. కాగా ఆస్ట్రియాలోని టైరోల్‌ రాష్ట్రంలో కొద్దికాలం కిందట పర్యావరణం కాపాడడంపై మోటారు సైకిళ్లపై నిషేధం విధించారు. తాజాగా  వియన్నాలో కూడా దీనిని అమలు చేయనున్నారు. అయితే టైరోల్‌ ప్రాంతంలో ఉన్న నిషేధానికి భిన్నంగా ఇక్కడ అమలు చేయనున్నారు. అందుకు వియన్నాలో ప్రఖ్యాత మోటారు సైకిల్ బ్రాండ్ కెటిఎమ్ తన మద్దతు తెలిపింది. ('తండ్రిగా వాడి కోరికను తీర్చా')


అన్ని రకాల టూ వీలర్స్‌ అంటే పర్యావరణానికి అనువుగా ఉండే బ్యాటరీ, ఎలక్ట్రికల్‌ చార్జింగ్‌తో నడిచే అన్ని రకాల వాహనాలను పూర్తిగా నిషేధం విధించనున్నారు.ఇప్పటికే వియాన్నా ప్రాంతంలో అత్యధికులు ద్విచక్ర వాహనాల నుంచి ఎలక్ట్రికల్‌ వాహనాలకు మారారు. అంతేగాక ఎలక్ట్రిక్ ప్యాసింజర్ కార్లను కూడా అక్కడి పౌరులు విస్తృతంగా అంగీకరించారు. అయితే మోటారు వాహనాలను పూర్తిగా నిషేధించాలని చేపట్టిన చర్యలపై వాహనదారులు ఆలక్ష్యం వహించడంతో స్థానిక అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. దీంతో వియన్నా సిటీ సెంటర్‌లో బైక్‌ పార్కింగ్‌లో ఉన్న వాహనాలపై కూడా ఈ నిషేధం వర్తించనుంది. అయితే సిటీ సెంటర్‌ వెలుపల ఉన్న రింగ్‌రోడ్డుపై మాత్రం అన్ని రకాల ప్రైవేట్‌ కార్లు, వాన్లు, మోటార్‌ సైకిళ్లు ఆ మార్గాన్ని ఉపయోగించుకోవడానికి అనుమతులు ఇచ్చింది. వియన్నా సిటీ సెంటర్‌లో నివసించే వ్యక్తులు, ప్రైవేట్‌ గ్యారేజీలో పనిచేసే వాళ్లకు మాత్రం ఫ్రీ రోడ్‌లో తిరిగే అవకాశంతో పాటు వాహన పార్కింగ్‌కు అనుమతులిచ్చారు. 

మరిన్ని వార్తలు