‘ఎవరెస్ట్’పై విరిగిపడ్డ మంచుచరియలు

19 Apr, 2014 04:18 IST|Sakshi

12 మంది నేపాలీ షెర్పాల మృతి
కఠ్మాండు: ప్రపంచంలోకెల్లా అత్యంత ఎత్తై పర్వత శిఖరమైన మౌంట్ ఎవరెస్ట్‌పై శుక్రవారం భారీ ప్రకృతి విపత్తు సంభవించింది. విదేశీ పర్వతారోహకులకు పోర్టర్లు, గైడ్లుగా వ్యవహరించే స్థానిక షెర్పాలు ఎవరెస్ట్ బేస్ క్యాంపు నుంచి మొదటి క్యాంపు వరకూ అధిరోహణ చేపడుతుండగా సుమారు 5,800 మీటర్ల (సుమారు 19 వేల అడుగులు) ఎత్తులో ఉదయం 6.45 గంటలకు ఒక్కసారిగా మంచు చరియలు విరిగిపడ్డాయి. ఈ దుర్ఘటనలో 12 మంది షెర్పాలు మృతిచెందగా మరో 10 మంది గాయపడ్డారు. మరో నలుగురు గల్లంతయ్యారు. మృతుల కుటుంబాలకు నేపాల్ ప్రభుత్వం సుమారు రూ. 25 వేల చొప్పున తక్షణ సాయాన్ని ప్రకటించింది.

మరిన్ని వార్తలు