'ఫ్యామిలీ ఫ్రెండ్లీ' పార్లమెంట్ రూల్

3 Feb, 2016 19:25 IST|Sakshi
'ఫ్యామిలీ ఫ్రెండ్లీ' పార్లమెంట్ రూల్

ఆస్ట్రేలియా ప్రభుత్వం కొత్త నిబంధనను అమల్లోకి తెచ్చింది. పార్లమెంట్ ఛాంబర్లో మహిళా ఎంపీలు తమ బిడ్డలకు పాలిచ్చేందుకు అనుమతించింది.  తల్లులు తమ పిల్లలకు పని వేళల్లోనే షెడ్యూల్ ప్రకారం పాలివ్వచ్చని తెలిపింది. కొత్తగా అమల్లోకి వచ్చిన 'ఫ్యామిలీ ఫ్రెండ్లీ' పార్లమెంట్ రూల్తో మహిళలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఆస్ట్రేలియాలో ఇంతకు ముందు పార్లమెంట్ ఛాంబర్లోకి పిల్లలను అనుమతించేవారు కాదు. అయితే ఇప్పుడా ఆ చట్టంలో మార్పులు తెచ్చారు. ఒక్క మహిళా ఎంపీలే కాదు... తల్లిదండ్రులు ఇద్దరిలో  పిల్లల సంరక్షణను చూసే ఎవరైనా  పిల్లలను తమతోపాటు ఛాంబర్లోకి తెచ్చుకునే అవకాశం కల్పించారు. ఈ కొత్త ఉత్తర్వులు సభ్యులందరికీ వర్తించేలా అమల్లోకి తేనున్నారు. అయితే ఇక్కడి మొత్తం హౌస్లో  150 మంది సభ్యుల్లో 40 మంది మహిళలే ఉన్నారు. ద

ఆడైనా, మగైనా పిలల సంరక్షణా బాధ్యత ఉన్నవారు పార్లమెంట్ నిర్వహణలో పాల్గొనలేకపోతారని, అందుకే ఇటువంటి అవకాశాన్ని కల్పించినట్లు సభాధ్యక్షుడు క్రిస్టోఫర్ పైన్ తెలిపారు. ప్రతిపక్ష సభ్యులు కూడా ఈ నిర్ణయాన్నిస్వాగతించారు. గతేడాది ఆస్ట్రేలియా పార్లమెంట్లో  ముగ్గురు సభ్యులు ఇంచుమించుగా ఒకేసారి మాతృత్వం పొందడంతో ఇటువంటి ప్రత్యేక నిర్ణయం తీసుకోడానికి కారణంగా చెప్పొచ్చు. కాగా ఇటలీ మహిళ మెప్ లికా రొంజుల్లి 2010లో తన ఆరు వారాల బిడ్డను తీసుకొని  ఓటింగ్లో పాల్గొంది. ఆ తర్వాత ఆమె కుమార్తె ప్రతి చర్చలోనూ భాగమైంది. పనిచేసే చోటకి పిల్లలను అనుమతించే ఈ కొత్త చట్టాన్ని ఐరోపా సమాఖ్యలోని దేశాల్లో మొట్ట మొదటిగా ఆస్ట్రేలియా అమల్లోకి తెచ్చింది.

>
మరిన్ని వార్తలు