బాంబు పేలుళ్లతో రక‍్తమోడుతున్న కొలంబో

21 Apr, 2019 10:02 IST|Sakshi

కొలంబో : శ్రీలంక రాజధాని కొలంబో బాంబు దాడులతో దద్దరిల్లింది. ఆదివారం ఈస్టర్‌ పండుగ సందర్భంగా చర్చ్‌లకు వచ్చేవారిని లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు వరుస పేలుళ్లకు పాల్పడ్డారు. ఈ దాడిలో 207 మంది మృతి చెందగా, 500మందికి పైగా గాయాలయ్యాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. దాడిలో గాయపడ్డ వారిని దగ్గరలోని ఆస్పత్రికి తరలించారు. ఉగ్రదాడితో శ్రీలంక ప్రభుత్వం అత్యవసర పరిస్థితిని విధించింది. ఈ రోజు ఉదయం నుంచి మూడు చర్చిలతో పాటు, మూడు హోటళ్లలో వరుసగా బాంబు పేలుళ్లు సంభవించాయి. 

కొలంబోలో కొచ్‌చికాడోలోని సెయింట్‌ ఆంథోనీ చర్చిలో, కథువాపితియాలోని కటానా చర్చిలో బాంబు పేలుడు చోటుచేసుకుంది. షాంగ్రి లా హోటల్‌, కింగ్స్‌ బరీ హోటల్‌లో కూడా బాంబుపేలుడు సంభవించినట్టు పోలీసులు గుర్తించారు. ఉగ్రదాడిపై భారత విదేశాంగ శాఖ అప్రమత్తమైంది. కొలంబోలోని భారత హైకమిషనర్‌తో సంప్రదింపులు జరుపుతున్నామని భారత విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్‌ తెలిపారు. బాంబు పేలుళ్లపై అక్కడి పరిస్థితిని పరిశీలిస్తున్నామని పేర్కొన్నారు.


మరిన్ని వార్తలు