‘మమ్మీ’ చెప్పిన కథ.. కట్టుకథేనట...

1 Jul, 2019 13:19 IST|Sakshi

ఈ ‘మమ్మీ’ చెప్పిన కథ.. కట్టుకథేనట. ఎలుగుబంటి దాడిలో గాయపడి.. దాని గుహలో నెలరోజులపాటు ఉండి.. మృత్యుంజయుడిలా బయటపడ్డాడంటూ అలెగ్జాండర్‌ అనే వ్యక్తి గురించి పాశ్చాత్య మీడియాలో పెద్ద ఎత్తున కథనాలు వచ్చాయి. ‘నన్ను తర్వాత తినడానికి వీలుగా ఇక్కడ దాచి పెట్టి ఉంచింది’ అంటూ అతడు చెప్పాడని తెలిపాయి. అయితే.. అవన్నీ అబద్ధాలని కజకిస్థాన్‌కు చెందిన వైద్యుడు రుస్తుం ఇసేవ్‌ చెబుతున్నారు. ‘మమ్మీ’లా కనిపించిన అలెగ్జాండర్‌ అసలు ఫొటో ఇదిగో ఇదేనట. ఇతడు తీవ్రమైన సొరియాసిస్‌ వ్యాధితోపాటు ఇతర రుగ్మతలతో బాధపడుతున్నాడట. అందువల్లే అలా అయిపోయాడట. అలెగ్జాండర్‌ కజకిస్థాన్‌కు చెందినవాడని.. ప్రస్తుతం ఔట్‌ పేషెంట్‌ కింద తమ వద్ద చికిత్స తీసుకుంటున్నాడని రుస్తుం తెలిపారు. తమ కుమారుడిని ఎలుగుబంటి దాడి బాధితుడిగా చూపించడం.. మమ్మీ అనడం వంటి వాటి వల్ల అలెగ్జాండర్‌ తల్లి ఎంతో బాధపడుతున్నారని.. అతడి గురించి మరే వివరాలు వెల్లడించవద్దని తమను కోరారని వివరించారు. 

చదవండి: ‘మమ్మీ’ మనిషి కథలో కొత్త మలుపు!


అలెగ్జాండర్‌ అసలు ఫొటో..

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా