'భారత్‌పై ఎప్పుడంటే అప్పుడు దాడి చేస్తాం'

21 Sep, 2016 10:54 IST|Sakshi
'భారత్‌పై ఎప్పుడంటే అప్పుడు దాడి చేస్తాం'

న్యూఢిల్లీ: పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ పుండుమీద కారం చల్లినట్లు మాట్లాడాడు. కశ్మీర్లో ఎవరు దాడి చేసిన తమనే(పాకిస్థాన్నే) బాధ్యులుగా చేయడం భారత్ కు అలవాటైపోయిందని అన్నారు. యూరీ సెక్టార్లో దాడికి సంబంధించి తమపై భారత్ ఎలాంటి మిలిటరీ చర్యలు తీసుకున్నా ఎప్పుడంటే అప్పుడు తాను(పాకిస్థాన్) ఎంపిక చేసుకున్న ప్రాంతంలో దాడులు చేయగలదని భారత్‌ను హెచ్చరించాడు. ప్రస్తుత దాడులకు సంబంధించి భారత్ మిలటరీ యాక్షన్ తో ప్రతీకారం తీల్చుకోవాల్సిందే అంటున్న డీజీఎంవో, డిఫెన్స్ మినిస్టర్ ఒక్కసారి జరుగుతున్న పరిణామాలు ఏమిటో అర్థం చేసుకుంటే మంచిదంటూ వ్యాఖ్యానించారు.

'ఇప్పుడు మీరు (భారత్) మీకు నచ్చిన చోటును ఎంపిక చేసుకొని దాడి చేస్తే మేం కూడా మాకు నచ్చిన చోట, నచ్చిన సమయంలో దాడి చేస్తాం' అంటూ ఆయన లండన్ లోని తన నివాసం నుంచి ఓ మీడియాతో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. పాక్ ఆర్మీ సహాయంతోనే జైషే ఈ మహ్మద్ సంస్థ యూరీ స్థావరంపై దాడులకు దిగిందన్న భారత్ వ్యాఖ్యలను తాము అంగీకరించబోమంటూ కొట్టి పారేశారు. 'దాడి జరిగిన గంటల్లోనే పాక్‌పై ఆరోపణలు చేసేందుకు ఆయన వద్ద ఏం ఆధారాలు ఉన్నాయో నాకు తెలియదు. కశ్మీర్ లో దాడి జరిగిన ప్రతిసారి పాకిస్థాన్‌ను నిందించడం ఇండియాకు అలవాటైపోయింది' అంటూ ముషార్రఫ్ వ్యాఖ్యానించాడు.

దాడికి పాల్పడిన ఆయుధాలు, పేలుడు సామాగ్రి మొత్తం పాక్ నుంచే వచ్చినట్లు ఆధారాలు ఉన్నాయి కదా అని ప్రశ్నించగా ప్రపంచంలోని ఏ ప్రాంతంలో నుంచైనా ఎవరైనా ఆయుధాలు కొనుగోలు చేసుకోవచ్చని తాఫీగా సెలవిచ్చాడు. ఆయుధాలు అక్కడివే అయినా.. ఆ దాడికి పాల్పడినవారు పాక్ నుంచే వచ్చారనడానికి ఆధారాలు లేవు కదా అంటూ ఎదురు ప్రశ్నించారు. జైషే ఈ మహ్మద్ అనేది పాకిస్థాన్‌లో నిషేధించిన ఓ సంస్థ అని, ప్రస్తుతం పాక్‌లో పనిచేయడం లేదంటూ సమాధానం ఇచ్చారు.

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు