ట్రంప్‌పై కోర్టుకెక్కిన ముస్లింలు

3 Oct, 2017 13:11 IST|Sakshi

ట్రావెల్‌ బ్యాన్‌.. చట్ట వ్యతిరేకం

న్యూయార్క్‌, మేరీల్యాండ్‌ కోర్టుల్లో దావా

వాషింగ్టన్‌ : ట్రంప్‌ అమెరికా దేశాధ్యక్షుడు అయిన తరువాత ముస్లిం దేశాలపై విధించిన ట్రావెల్‌ బ్యాన్‌పై తొలిసారి ముస్లిం న్యాయవాదులు కోర్టును ఆశ్రయించారు. ట్రంప్‌ ట్రావెల్‌ బ్యాన్‌ నిర్ణయం అమెరికా రాజ్యాంగానికి, చట్టాలకు వ్యతిరేకమంటూ.. ఇరానియన్‌, అమెరికన్‌ ముస్లింల సమాఖ్య, లీగల్‌ ఇనిస్టిట్యూట్‌లు మేరీల్యాండ్‌.. న్యూయార్క్‌ ఫెడరల్‌ కోర్టులను ఆశ్రయించాయి. ట్రంప్‌ ట్రావెల్‌ బ్యాన్‌ విధించాక.. చట్ట పరమైన పోరాటం మొదలు కావడం ఇదే తొలిసారి. ట్రావెల్‌ బ్యాన్‌పై దాఖలైన దావాలపై.. అమెరికా డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ జస్టిస్‌ వ్యాఖ్యానించడానికి నిరాకరించింది.

ట్రావెల్‌ బ్యాన్‌కు ట్రంప్‌ అడ్మినిస్ట్రేషన్‌ కొన్ని సవరణలు చేస్తూ.. రెండు రోజుల కిందట తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. కొత్త ఉత్తర్వుల ప్రకారం చాద్‌, ఇరాన్‌, లిబియా, ఉత్తర కొరియా, సోమాలియా, సిరియా, యెమన్‌, వెనుజులాకు చెందిన కొందరు ప్రభుత్వాధికారులు, వారి కుటుంబ సభ్యులపై అమెరికా ట్రావెల్‌ బ్యాన్‌ విధించింది. ఈ ఉత్తర్వులు ఈ నెల 18 నుంచి అమల్లోకి వస్తాయి.

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు