నా కూతురు అధ్యక్షురాలైతే బాగుండేది: కిమ్‌

1 Sep, 2017 08:25 IST|Sakshi
నా కూతురు అధ్యక్షురాలైతే బాగుండేది: కిమ్‌

సాక్షి, లాస్‌ ఏంజిల్స్‌: తన నాలుగేళ్ల కూతురు అమెరికా అధ్యక్షురాలైతే బాగుండేదని ప్రముఖ టీవీ నటి కిమ్‌ కర్దాషియన్‌ అన్నారు. ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కంటే తన కూతురు నార్త్‌ వెస్ట్‌ అద్భుతంగా పరిపాలిస్తుందని జోక్‌ చేశారు. ఓ అంతర్జాతీయ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వూలో ఆమె ఈ వాఖ్యలు చేశారు. ఇప్పుడున్న అధ్యక్షుడి కంటే వేరే వాళ్లు ఎవరైనా అమెరికాను చక్కగా పరిపాలిస్తారని కిమ్‌ అన్నారు. తన కూతురైతే ఇంకా బాగా పాలిస్తుందని చెప్పారు.

అమెరికా ప్రపంచంలో అగ్రరాజ్యంగా నిలవడానికి దేశ పౌరులు కష్ట పడ్డారని తెలిపారు. అమెరికా గురించి గొప్పగా చెప్పుకోవడానికి చాలా కారణాలు ఉన్నాయని అన్నారు. అయితే, ట్రంప్‌ మాత్రం అమెరికాను వెనక్కు తీసుకెళ్లిపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఏ రోజు ఏం జరుగుతుందనే ఆందోళన ట్రంప్‌ అధ్యక్ష పదవి చేపట్టిన నాటి నుంచి ప్రజల్లో నెలకొందని చెప్పారు.

మరిన్ని వార్తలు