మిస్టరీని ఛేదించిన గూగుల్ మ్యాప్!

13 Nov, 2015 19:27 IST|Sakshi
మిస్టరీని ఛేదించిన గూగుల్ మ్యాప్!

పదేళ్ళ క్రితం తప్పిపోయిన వ్యక్తి  మిస్టరీ... గూగుల్ మ్యాప్ ఛేదించింది. గూగుల్ తీసిన ఏరియల్ ఇమేజ్ లో నీటి అడుగు భాగంలో ఉన్న కారులో ఓ వృద్ధుని శరీరం ఉన్నట్లు గుర్తించారు. ఎప్పుడో 2006 అక్టోబర్ 11న తప్పిపోయిన డేవీ లీ నైల్స్... మిచిగన్.. బైరాన్ టౌన్ షిప్ లోని.. జేక్స్ బార్ పాండ్ లో కనిపించాడు. లీ కుటుంబం.. ఇక 72 ఏళ్ళ ఆ వృద్ధుడి  జాడ కనిపెట్టడం పై ఆశలు వదులుకున్నారు. చివరికి 2011 లో ఆయన సంస్మరణార్థం చరిత్రను పబ్లిష్ కూడా చేశారు.

మిచిగన్ పాండ్ లో ఓ వ్యక్తి శరీరంతో పాటు ఉన్న కారును గూగుల్ మ్యాప్ గుర్తించడంతో పోలీసులు విచారణ ప్రారంభించారు. లీ ఓ ఫ్రెండ్ తో కలసి హఠాత్తుగా బయటకు వెళ్ళిపోయాడని, అప్పటికే అతడు క్యాన్సర్ తో బాధపడుతుండేవాడని అతడి కుటుంబం అప్పట్లో వెల్లడించింది. అయితే ఇప్పుడు కూడా అతడు ఎలా మృతి చెంది ఉంటాడో మాత్రం ఎవరూ చెప్పలేకపోతున్నారు. అతడి సంస్మరణార్థం నిర్మించిన హోమ్ బయట క్రిస్మస్ ట్రీ ని అలంకరిస్తున్న సమయంలో లిఫ్ట్ లో నుంచి చూస్తున్న హౌస్ మ్యాన్ బ్రియాన్ కు అకస్మాత్తుగా పాండ్ లో కారు మునిగి ఉన్నట్లుగా కనిపించడంతో అతడు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. నిజంగా పాండ్ లో కారు ఉండటం చూసి తాను ఎంతో ఆశ్చర్యపోయాను అంటూ వివరించాడు.  గాఢాందకారంగా ఉన్న ఆ స్థలాన్ని ఎప్పుడూ ఎవరూ పట్టించుకోలేదని, అక్కడ అతడు ఉంటాడని కూడా ఎవరూ ఊహించలేదని అన్నాడు. అయితే గూగుల్ తీసిన చిత్రాల్లో మాత్రం కారులో నైల్స్ బాడీ ఉన్నట్లు గుర్తించారు.

తొమ్మిదేళ్ళ రహస్యం బయటపడింది. అయితే అసలు ఆ సంఘటన ఎలా జరిగింది? వివరాలు మాత్రం తెలియలేదు. హౌస్ మ్యాన్ చెప్పిన వివరాలను బట్టి  కెంట్ కౌంటీ షెరీఫ్స్ డిపార్ట్ర్ట్ మెంట్ సిబ్బంది పాండ్ లోని కారును గుర్తించింది. డైవ్ టీమ్ నీటిలో కారు ఉన్నట్లుగా నిర్ధారించారు. క్రేన్స్ సహాయంతో కారును బయటకు  తీశారు. నైల్స్ చివరిసారి కనిపించిన ప్రాంతానికి అరమైలు దూరం లో ఆ పాండ్ ఉందని కుటుంబ సభ్యులు చెప్పిన వివరాలను బట్టి చెప్తున్నారు. కారులోని డ్రైవర్ సీటులో నైల్స్ స్కెలిటెన్ ఉండగా... మట్టితో పూడిపోయిన కారును బయటకు తీశారు. అక్కడకు వచ్చిన బంధువులు నైల్స్ శరీర అవశేషాలను చూసి దుఃఖ సాగరంలో మునిగిపోయారు. అయితే ఎట్టకేలకు పదేళ్ళ అనుమానాలకు తెరపడినందుకు ఊపిరి పీల్చుకున్నారు. ఇక శోధనకు ముగింపు దొరికినట్లేనని.. నైల్స్ అల్లుడు స్కాట్ హాత్ వే అన్నారు. ఇన్నాళ్ళు నైల్స్ జాడ తెలియకుండా దేవుడు ఎందుకు ఉంచాడో తెలియదు కానీ... చివరకు ఇంటికి చేర్చడం సంతోషంగా ఉందన్నారు.

అయితే అధికారులు నైల్స్ మరణానికి సంబంధించిన మిగిలిన వివరాలను సేకరిస్తున్నారు. నైల్స్ దంతాల రికార్డును బట్టి పూర్తి విషయాలు తెలిసే అవకాశం ఉందని ఎదురు చూస్తున్నారు. అయితే ప్రస్తుతానికి అతడి జేబులోని వాలెట్ ను బట్టి అది నైల్స్ శరీరమేనని నమ్ముతున్నారు. ఇది నాటకం అయి ఉండక పోవచ్చని అంటున్నారు. అయితే కచ్ఛితంగా అసలేం జరిగి ఉంటుంది అన్నది మాత్రం తెలుసుకోవాల్సి ఉందని అధికారులు చెప్తున్నారు.

మరిన్ని వార్తలు