నెయిల్‌ పాలిష్‌​ ధర వింటే.. గుండె ఆగుతుంది?!

21 Jan, 2018 13:49 IST|Sakshi

ప్రతి మనిషి జీవితంలో తన స్థాయిలో లగ్జరీని కోరుకుంటున్నాడు. వస్తువు ఎలాంటిది అయినా.. దాని ఖరీదు మాత్రం తన స్థాయికన్నా అధికంగా ఉండాలని అనుకుంటున్నాడు. ఈ నేపథ్యంలో ప్రతి వస్తువును తయారీదారులు అదే స్థాయిలో రూపొందించిస్తున్నారు. ఇదిగో ఇక్కడ మీరు చూస్తేన్న నెయిల్‌ పాలిష్‌ కూడా అటువంటిదే. 

దీనిని ప్రపంచంలోని కోటీశ్వరుల్లో చాలాతక్కువ మంది మాత్రమే ఉపయోగించలరు. లగ్జరీకి పరాకాష్టగా కూడాదీనిని చెప్పుకోవచ్చు. ఎందుకంటే దీని ఖరీదు. కేవలం కోటీ 63 లక్షల 66 వేల రూపాయలు  మాత్రమే. దీనిని దిగుమతి చేసుకోవాలంటే అదనంగా మరో పది లక్షల రూపాయలు చెల్లించాల్సిందే. 

ఇంతటి ఖరీదైన నెయిల్‌ పాలిష్‌ని లాస ఏంజెల్స్‌లోని లగ్జరీ సౌందర్య సాధానాల తయారీ సంస్థ అజాతురే రూపొందించింది. ఈ నెయిల్‌ పాలిష్‌లో 267 కేరట్ల బ్లాక్‌ డైమండ్‌ను ఉపయోగించారు. అందుకే ఇంత ఖరీదు అని సంస్థ అధికారులు చెబుతున్నారు. ఈ బ్లాక్‌ డైమండ్‌ నెయిల్‌ పాలిష్‌ను కేవలం ఆర్డర్‌ మీద మాత్రమే తయారు చేస్తామని చెప్పారు.

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు