ట్రంప్‌ - పెలోసీల మధ్య వార్ షురూ..!

5 Feb, 2020 14:27 IST|Sakshi

వాషింగ్టన్‌: అమెరికా జాతీయ కాంగ్రెస్‌ సమావేశాల్లో ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌, స్పీకర్‌ నాన్సీ పెలోసికి గత కొద్ది కాలంగా ఉన్న విభేదాలు మరోసారి బ​యటపడ్డాయి. ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగించేందుకు సెనేట్‌కు వచ్చిన ట్రంప్‌ స్పీకర్‌కు షేక్‌హ్యాండ్‌ ఇచ్చేందుకు నిరాకరించారు. దీంతో ఆమె తన చేతిలో ఉన్న ప్రసంగ పత్రాలను రెండు ముక్కలుగా చేసి తన నిరసన వ్యక్తం చేసింది. ఈ చర్య అందరినీ ఆశ్చర్యపరిచింది. చాలా కాలంగా వీరి మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి.

(సెనేట్‌ కొట్టేయాలి అంతే..)

ట్రంప్‌పై అభిశంసనను సెనేట్‌లో చేపట్టింది స్పీకర్‌ నాన్సీనే కావడంతో ఆమెతో చేతులు కలపడానికి ట్రంప్‌ నిరాకరించినట్లు తెలుస్తోంది. వీరివురు ఎదురుపడిన సందర్భాల్లోనూ కనీస పలకరింపులు కూడా ఉండటం లేదు. అభిశంసనకు కారణమైన స్పీకర్‌తో గత కొద్ది నెలలుగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ దూరంగా ఉంటున్నారు. ఈ క్రమంలోనే షేక్‌ హ్యాండ్‌ ఇవ్వకుండా ఒకరు ప్రసంగ పత్రాలు ముక్కలు చేసి మరొకరు తమ అసహనాన్ని బయటపెట్టుకున్నారు. అయితే గతంలో ఉక్రెయిన్‌ అధ్యక్షుడిని ట్రంప్‌ బెదిరించినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో సెనేట్‌ ఆయనపై అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు