ప్రపంచంలోనే అతిచిన్న బైబిల్...

10 Dec, 2014 16:29 IST|Sakshi
ప్రపంచంలోనే అతిచిన్న బైబిల్...

వేలు గోరు కన్నా చిన్నగా ఉన్న ప్రపంచంలోనే అతిచిన్న బైబిల్ ఇది. ఒక్కో పక్క 4.76 మిల్లీమీటర్ల సైజు మాత్రమే ఉన్న సిలికాన్ నానోచిప్‌తో జెరూసలెం నానో బైబిల్ కంపెనీవారు తయారుచేశారు. బైబిల్ గ్రీకు వెర్షన్‌లోని న్యూ టెస్టమెంట్(కొత్త నిబంధన)లో గల 27 భాగాలను దీనిపై ముద్రించారు. ఒక్కోఅక్షరం 0.18 మైక్రాన్లు అంటే.. ఒక మీటరులో 1.80 కోట్ల వంతు సూక్ష్మం గా ఉంటుందట.

అందుకే.. దీనిని చదవాలంటే మైక్రోస్కోపు కింద పెట్టాల్సిందే. ఈ నానోబైబిల్‌ను లాకెట్‌లో, గడియారంలో, ఇతర ఆభరణాల్లో అమర్చుకోవచ్చు. ప్రస్తుతం అతిచిన్న బైబిల్  రికార్డు ఓ భారతీయుడి పేరు మీదే ఉంది. ఈ నానో బైబిల్ ఇంకా చిన్నది కాబట్టి.. గిన్నిస్ రికార్డు ఖాయమని, దరఖాస్తు చేసుకోవాల్సిందే మిగిలిందని చెబుతున్నారు. అయితే, ప్రపంచంలోనే అతిచిన్న పుస్తకంగా ‘టీనీ టెడ్ ఫ్రమ్ టర్నిప్ టౌన్’ అనే 30 పేజీల కథల పుస్తకం పేరు మీదే రికార్డు ఉంది.

మరిన్ని వార్తలు