కాన్బెర్రా నుంచి మెల్బోర్న్కు మోదీ

18 Nov, 2014 10:01 IST|Sakshi


మెల్బోర్న్ : భారత ప్రధాని నరేంద్ర మోదీ మెల్బోర్న్ చేరుకున్నారు. ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా ఆయన ప్రత్యేక విమానంలో కాన్బెర్రా నుంచి మెల్బోర్న్ విచ్చేశారు. అంతకు ముందు కాన్బెర్రాలో ఆస్ట్రేలియా ప్రధానమంత్రి టోనీ ఎబాట్, మోదీ మధ్య మంగళవారం శిఖరాగ్ర చర్చలు జరిగాయి. ఈ సందర్భంగా సామాజిక భద్రత, ఖైదీల మార్పిడి, డ్రగ్స్పై  పోరు...తదితర అంశాలపై ఒప్పందాలు కుదిరాయి. సాంస్కృతిక, పర్యాటక రంగాలపై కూడా ఇరుదేశాల మధ్య అవగాహనా ఒప్పందాలు కుదిరినట్లు తెలుస్తోంది.

కాగా అబాట్తో చర్చల అనంతరం ఆస్ట్రేలియా పార్లమెంట్నుద్దేశించి మోదీ ప్రసంగించారు. ఈ సందర్భంగా ప్రధాని టోనీ ఎబాట్  చారిత్రక రికార్డు పత్రాలను మోదీతో పంచుకున్నారు. మోదీ తన  ప్రసంగం అనంతరం బ్రిటన్ పార్లమెంట్ నేతలను పరిచయం చేసుకున్నారు.  కాగా మోదీ రాత్రికి మెల్బోర్న్ నుంచి ఫిజి పర్యటనకు బయల్దేరతారు. ఆయన పదిరోజుల్లో మూడు దేశాల్లో పర్యటించటం విశేషం.

మరిన్ని వార్తలు