ముగిసిన చైనా టూర్.. మంగోలియాకు మోదీ

16 May, 2015 19:37 IST|Sakshi

ఉలాన్ బటొర్: భారత ప్రధాని నరేంద్ర మోదీ చైనా పర్యటన ముగిసింది. మూడు దేశాల పర్యటనకు వెళ్లిన మోదీ.. శనివారం సాయంత్రం మంగోలియా చేరుకున్నారు. మంగోలియాలో మోదీ రెండ్రోజులు పర్యటిస్తారు. మంగోలియా అధ్యక్షుడు ట్సకియగీన్ ఎల్బెగ్డోజ్, ప్రధాని చిమెడ్ సైఖన్బీలెగ్లతో సమావేశంకానున్నారు. ఆర్థిక, వాణిజ్య సహకారం, రవాణ, హైవేల విస్తరణ, ఇంధన రంగాలకు సంబంధించి మోదీ చర్చలు జరపనున్నారు. భారత ప్రధాని మంగోలియాలో పర్యటించడం ఇదే తొలిసారి. ఆదివారం మంగోలియా పార్లమెంట్ను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఈ గౌరవం దక్కిన తొలి విదేశీ నేత మోదీయే కానుండటం విశేషం. మంగోలియా పర్యటన తర్వాత మోదీ అక్కడి నుంచి దక్షిణ కొరియా వెళ్లనున్నారు.

మరిన్ని వార్తలు