ఐక్యరాజ్యసమితిలో మోడీ ప్రసంగం

27 Sep, 2014 20:36 IST|Sakshi

న్యూయార్క్: భారత్ దృష్టిలో ప్రపంచం వసుధైక కుటుంబమని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. భారత కాలమాన ప్రకారం శనివారం రాత్రి 8 గంటలకు ఐక్యరాజ్య సమతి జనరల్ అసెంబ్లీలో మోడీ హిందీలో ప్రసంగించారు. యూఎన్వో ప్రసంగించడం గర్వకారణంగా ఉందని అన్నారు.

మొన్నటి వరకు 91 దేశాలు ఉండేవి ఇప్పుడు 193 దేశాలున్నాయని మోడీ చెప్పారు. ఆసియా, ఆఫ్రికా దేశాల్లో ప్రజాస్వామ్యం బలపడుతోందని పేర్కొన్నారు. ఉగ్రవాదం కొత్తపేర్లతో పుట్టుకొస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. పొరుగుదేశం పాకిస్థాన్తో స్నేహాన్ని కోరుకుంటున్నామని, ఆ దేశం చర్చలకు సానుకూల వాతావరణం కల్పించాలని అన్నారు. భద్రతామండలిని మరింత ప్రజాస్వామ్యబద్ధంగా మార్చాల్సిన అవసరముందని మోడీ అభిప్రాయపడ్డారు.
 

మరిన్ని వార్తలు