చైనాకు సంకేతాలు పంపిన భారత్‌

2 Sep, 2017 13:07 IST|Sakshi
చైనాకు సంకేతాలు పంపిన భారత్‌

టెర్రరిజం గురించి మేం మాట్లాతాం.. నో డౌట్‌!
►చైనాకు సంకేతాలు పంపిన భారత్‌

న్యూఢిల్లీ : చైనా తాటాకు చప్పుళ్లుకు భారత్‌ దీటుగానే బదులిస్తోంది. మొన్న డోక్లాం సమస్య పరిష్కారం అనంతరం.. తాజాగా బ్రిక్స్‌ వేదికగా భారత్‌ ఉగ్రవాద సమస్య గురించి, ప్రత్యేకంగా పాకిస్తాన్‌ గురించి మాట్లాడకూడదని చైనా పంపిన సంకేతాలకు భారత్‌ గట్టిగానే సమాధానం చెబుతోంది. ఈ నెల 3 నుంచి 5 వరకూ చైనాలో జరగనున్న బ్రిక్స్‌ సదస్సులో భారత ప్రధాని నరేంద్ర మోదీ ఉగ్రవాదం గురించి గట్టిగా మాట్లాడతారని ప్రభుత్వ వర్గాలు సంకేతాలు పంపాయి. బ్రిక్స్‌ వేదికపై ఉగ్రవాదం, పాక్‌ గురించి మాట్లాడకూడదని చైనా సంకేతాలు పంపింది. అయితే గంటల వ్యవధిలో అందుకు స్పందించిన భారత్‌.. ప్రధాని మోదీ గట్టిగానే ఉగ్రవాదం గురించి ప్రస్తావిస్తారన్న సిగ్నల్స్‌ను బీజింగ్‌కు పంపింది.

బ్రిక్స్‌ సదస్సుల్లో భాగంగా ఈ నెల 4న అంతర్జాతీయ, ప్రాంతీయ సమస్యలు చర్చకు వచ్చే అవకాశం ఉంది. ఆ సందర్భంగా ఉగ్రవాదం, పాకిస్తాన్‌ గురించి మోదీ ప్రస్తావించే అవకాశం ఉందని విదేశాంగ శాఖ తెలిపింది. బ్రిక్స్‌ సమావేశానికి హాజరవుతున్న మోదీ.. చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో ద్వైపాక్షిక సంబంధాల్లో భాగంగా సమావేశమవుతారా? లేదా? అన్న విషయంపై విదేశాంగ శాఖ స్పష్టత ఇవ్వలేదు.  బ్రిక్స్‌ సదస్సులో భారత్‌, చైనా, రష్యా, బ్రెజిల్‌, దక్షిణాఫ్రికా దేశాల అధినేతలు పాల్గొంటారు.

 

>
మరిన్ని వార్తలు