దిగ్గజ యాత్రికుడి అస్తమయం.. నాసా ఘన నివాళులు

23 Dec, 2017 10:37 IST|Sakshi

వాషింగ్టన్‌ : నాసా తరపున తొలిసారి అంతరిక్షంలో స్వేచ్ఛా విహారం చేసిన యాత్రికుడు బ్రూస్‌ మెక్‌ కాండ్లెస్స్‌ ఇక లేరు. గురువారం ఆయన మృతి చెందినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని నాసాకు చెందిన జాన్‌సన్‌ స్పేస్‌ సెంటర్‌ కాసేపటి క్రితం ఓ ప్రకటనలో తెలిపింది. 

80 ఏళ్ల బ్రూస్‌ మెక్‌ కాండ్లెస్స్ అనారోగ్యంతో మరణించినట్లు సమాచారం. కాగా, 1984లో ఛాలెంజర్‌ స్పేస్‌ షటిల్‌లో ప్రయాణించిన ఆయన అంతరిక్షంలో ఎలాంటి ఆధారం లేకుండా  తేలియాడిన తొలి వ్యక్తిగా రికార్డు సృష్టించారు. ఆయన అలా తేలుతున్న ఫోటోకు ఐకానిక్‌ ఫోటోగా గుర్తింపు కూడా లభించింది. మనిషి తలుచుకుంటే సాధించలేదనిది ఏదీ లేదని.. ఇది అమెరికన్లను ఎంతో గర్వకారణమని ఆ సమయంలో పలువురు ఖగోళ శాస్త్రవేత్తలు కితాబు కూడా ఇచ్చారు. 

కాగా, బోస్టన్ లో జన్మించిన ఆయన కాలిఫోర్నియాలోనే విద్యాభ్యాసం చేశారు. నావల్‌ అకాడమీ నుంచి ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్‌లో పట్టా సాధించి.. 1973లో స్కై లాబ్ మిషన్‌లో ఆయన పాలుపంచుకున్నాడు. ఆపై 1984లో ప్రతిష్టాత్మక నాసా ఛాలెంజర్‌ ద్వారా అంతరిక్షంలో విహరించారు. 2006లో నాసాకు సంబంధించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మీడియాకు కనిపించటం అదే చివరిసారి. ఆ సమయంలో తాను ఎదుర్కున్న అనుభవాలను అప్పుడు వివరించి ఎంతో భావోద్వేగానికి గురయ్యారు కూడా.  2015లో గార్డియన్‌ పత్రిక ఆయన చివరి ఇంటర్వ్యూను ప్రచురించింది. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.

మరిన్ని వార్తలు