ప్రయోగం విజయవంతం

16 Dec, 2016 15:08 IST|Sakshi
ప్రయోగం విజయవంతం

ఉపగ్రహాలను భూమిపై స్థిరప్రయోగ కేంద్రం నుంచి ప్రయోగించడం చూశాం. అందుకు భిన్నమైన ప్రయోగమిది. కింద బిగించిన ఉపగ్రహాలున్న రాకెట్‌ను విమానం మోసుకెళ్తుంది. ఆకాశంలో వెళ్తున్నపుడు దాని నుంచి విడివడి రాకెట్‌ అంతరిక్షంలోకి దూసుకెళ్తుంది. తుపాన్ల జాడ పసిగట్టి, వాటి సామర్థ్యాన్ని అంచనావేసి, హెచ్చరించే 8 ఉపగ్రహాలున్న నాసా ‘సైక్లోన్ గ్లోబల్‌ నావిగేషన్ శాటిలైట్‌ సిస్టమ్‌’ను రాకెట్‌ విజయవంతంగా అట్లాంటిక్‌ సముద్రంపై 39వేల అడుగుల ఎత్తులో ప్రయోగించింది. యూఎస్‌లోని కేప్‌ కనావరెల్‌లో తీసిందీ ఫొటో.

మరిన్ని వార్తలు