అంతరిక్ష వాసనలు ఇకపై భూమి మీద కూడా!

29 Jun, 2020 16:29 IST|Sakshi

స్పేస్‌లో వ్యోమగాములు వాసన కోసం ఉపయోగించే సువాసనలు ఇకపై సామాన్యులకు సైతం చేరువ కానున్నాయి. స్పేస్‌లో వాసన పీల్చుకోవడానికి వ్యోమగాములకు ప్రత్యేకమైన సువాసనలు అందిస్తారు. వ్యోమగాములు అంతరిక్ష వాసనకు అలవాటు పడటానికి అభివృద్ధి చేసిన కొన్ని సంవత్సరాల తరువాత, అలాంటి వాసనలే ఉండే సువాసనలను త్వరలో సాధారణ ప్రజలకు అందుబాటులోకి తీసుకురానున్నారు. యూ డి స్పేస్‌ను రసాయన శాస్త్రవేత్త,  ఒమేగా ఇన్‌గ్రీడియన్స్‌ వ్యవస్థాపకుడు స్టీవ్ పియర్స్ అభివృద్ధి చేశారు. (అంత‌రిక్షంలో దోశ‌)

మిస్టర్ పియర్స్ నాసాతో అంతరిక్ష వాసనను తయారుచేయడానికి 2008 లో ఒప్పందం కుదుర్చుకున్నారు. అంతరిక్షంలోకి వెళ్ళే వ్యోమగాములకు అక్కడ ఉండే వాసనలు భిన్నంగా అనిపించకుండా ఉండటానికి దీనిని అభివృద్ధి చేయమని నాసా పియర్స్‌ను కోరింది. దీనిని తయారు చేయడానికి అతనికి నాలుగు సంవత్సరాలు పట్టింది. బాహ్య అంతరిక్ష వాసన ఎలా ఉంటుందో అనే విషయాన్ని వ్యోమగామి, పెగ్గి విట్సన్ 2002 లో ఒక ఇంటర్వ్యూలో తెలియజేస్తూ  ‘కాల్చిన వెంటనే తుపాకీ నుంచి వచ్చిన వాసన లాగా ఉంటుంది’ అని తెలిపారు. ‘పొగ వాసన, కాలిపోయిన వాసనకు తోడు ఇది దాదాపు చేదుగా ఉండే వాసన కలిగి ఉంటుంది’ అని కూడా ఆయన చెప్పారు. యునిలాడ్ ప్రకారం,  పియర్స్ వ్యోమగాముల  నుంచి అంతరిక్షంలో ఉండే వాసన ఎలా ఉంటుందో తెలుసుకొని దీనిని రూపొందించినట్లు తెలుస్తోంది. వ్యోమగాములలో చాలా మంది   అంతరిక్ష వాసనను ‘గన్‌పౌడర్, సీరెడ్ స్టీక్, కోరిందకాయలు, రమ్ కలయిక’ అని అభివర్ణించారు. (వైరల్‌గా మారిన సూర్యుడి వీడియో..)

మరిన్ని వార్తలు