వందకు పైగా కొత్త గ్రహాలు!

16 Jun, 2018 04:15 IST|Sakshi

లాస్‌ఏంజెలెస్‌: మన సౌర కుటుంబానికి వెలుపల వందకు పైగా గ్రహాలను శాస్త్రవేత్తలు కనుగొన్నారు. వాటి ఉపగ్రహాలపై జీవనానికి అనుకూలమైన వాతావరణం ఉండే అవకాశం ఉందని భావిస్తున్నారు.  ఈ గ్రహాలన్నీ వాయు గ్రహాలైనప్పటికీ వాటి ఉపగ్రహాలపై మాత్రం భూమి మాదిరిగా నేలలు ఉండే అవకాశం ఉందని ఆస్ట్రేలియాలోని యూనివర్సిటీ ఆఫ్‌ సదరన్‌ క్వీన్స్‌లాండ్‌ శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. 2009లో అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా ప్రయోగించిన కెప్లర్‌ టెలిస్కోప్‌ ద్వారా ఇప్పటికే మన సౌర వ్యవస్థకు వెలుపల వేలాది గ్రహాలను కనుగొన్న విషయం తెలిసిందే.

మరిన్ని వార్తలు