పేలిపోయిన అమెరికా రాకెట్!

30 Oct, 2014 01:24 IST|Sakshi
పేలిపోయిన అమెరికా రాకెట్!

ప్రయోగించిన ఆరు సెకన్లకే విస్ఫోటం  రూ.1,225 కోట్లు బుగ్గి పాలు

వాషింగ్టన్: అమెరికా అంతరిక్ష సంస్థ నాసాతో కాంట్రాక్టులో భాగంగా ప్రైవేటు కంపెనీ ఆర్బిటల్ సెన్సైస్ కార్పొరేషన్ ప్రయోగించిన మూడో రాకెట్ పేలిపోయింది. ప్రయోగించిన ఆరు సెకన్లకే మొదటిదశ కూడా పూర్తికాకముందే ముక్కలుచెక్కలైన అంటారీజ్ రాకెట్ భారీ విస్ఫోటంతో నేలరాలింది. అమెరికాలోని వర్జీనియా తీరం నుంచి మంగళవారం సాయంత్రం 6:22 గంటలకు నిర్వహించిన ఈ ప్రయోగం విఫలం కావడంతో 2,267 కిలోల బరువైన 26 మినీ ఉపగ్రహాలు, పరికరాలు, మానవరహిత వ్యోమనౌక సిగ్నస్ అగ్నికి ఆహుతయ్యాయి.

ప్రయోగవేదిక ప్రాంతంలో భారీ ఎత్తున పేలుడు సంభవించి మంటలు ఎగిసిపడటంతో పాటు దట్టమైన పొగలు అలుముకున్నాయి. దీంతో  రూ.1,225 కోట్లు బుగ్గిపాలు అయ్యాయి. ఈ రాకెట్ ప్రయోగం విఫలం కావడంపై అమెరికా అధ్యక్షుడు ఒబామా వెంటనే అధికారులతో అత్యవసర భేటీలో వివరాలు తెలుసుకున్నారు. అయితే, రాకెట్ పేలిపోవడానికి కారణాలేంటన్నది ఇంకా తెలియలేదని, దీనిపై దర్యాప్తు చేస్తామని నాసా పేర్కొంది.

>
మరిన్ని వార్తలు