అంగారక గుట్టుమట్ల ఆవిష్కరణ..

5 Mar, 2020 19:45 IST|Sakshi

న్యూయార్క్‌ : అంగారక గ్రహంపై సూక్ష్మజీవులు స్ధిర నివాసం ఏర్పరచుకునే అనుకూల పర్యావరణ పరిస్ధితులు ఉన్నాయా అనే ప్రశ్నకు సమాధానం వెతుకుతూ ఆగస్టు 5న మార్టిన్ ఉపరితలంపై నాసాకు చెందిన క్యూరియాసిటీ రోవర్ 2012 కాలుమోపింది. రోవర్ 21.92 కిలోమీటర్లు ప్రయాణించి, రెడ్‌ ప్లానెట్‌లో మొత్తం 654,661 చిత్రాలను తీసింది. నాసా క్యూరియాసిటీ రోవర్ 2.43 .జీబీ ఫైలు పరిమాణాన్ని కలిగి ఉన్న మార్స్ యొక్క అత్యధిక-రిజల్యూషన్ కలిగిన అంగారక సమగ్ర స్వరూపాన్ని ఆవిష్కరించే 1000 ఫోటోలను విడుదల చేసింది. 360-డిగ్రీల అనుభూతిని ఆస్వాదించేలా ఉన్న ఈ  చిత్రాలు , 2019 నవంబర్ 24 - డిసెంబర్ 1 మధ్య తీసినవి.

ఈ రోవర్‌ వ్యక్తిగత షాట్లను తీసేందుకు నాలుగు రోజులలో ఆరున్నర గంటలకు పైగా అవసరం. "మా బృందంలో చాలామంది టర్కీ అందాలను ఆస్వాదిస్తుండగా, క్యూరియాసిటీ అంగారక గ్రహ ఆనవాళ్లను కళ్ళకు కడుతూ ఈ అద్భుత చిత్రాలను అందించింద’ని క్యూరియాసిటీ రోవర్ మిషన్‌కు నాయకత్వం వహించిన సంబంధిత ప్రాజెక్ట్ శాస్త్రవేత్త అశ్విన్ వాస్వాడ అన్నారు. ఇక​ 2013లోనే రోవర్ మాస్ట్‌క్యామ్ కెమెరాలతో పాటు నావిగేషన్ కెమెరాలను ఉపయోగించి 1.3 బిలియన్-పిక్సెల్ పనోరమా చిత్రాన్ని రూపొందించింది.

క్యూరియాసిటీ ప్రయాణం
క్యూరియాసిటీ అంగారక గ్రహంపై ప్రయాణిస్తున్న క్రమంలో ఈ బిలం కొన్ని వందల సంవత్సరాల కిందట ఓ సరస్సుతో పాటు సూక్ష్మజీవుల జీవనానికి అనుకూలమైన వాతావరణం కలిగి ఉందని కనుగొన్నారు. గత ఏడాది అక్టోబర్‌లో నాసా రెడ్‌ప్లానెట్‌పై క్యూరియాసిటీ తీసిన సెల్ఫీని అలాగే అంగారక గ్రహంపై పురాతన ఒయాసిస్ చిత్రాన్ని వెల్లడించిన క్రమంలోనూ ఇవే అంచనాలు వెల్లడయ్యాయి. అంగారక గ్రహంపై సూక్ష్మజీవుల ఆనవాళ్లను అందించేలా క్యూరియాసిటీ కొత్త సాక్ష్యాలను కూడా కనుగొంది, ఉప్పగా, నిస్సారమైన చెరువులు గతంలో ఉండేవని, క్రమంగా ఇవి ఎండిపోయాయనే సంకేతాలను పసిగట్టింది.

చదవండి : 'నాసా'మిరంగా!


రెడ్‌ప్లానెట్‌లో మీథేన్ రహస్యాన్ని ఛేదించేలా అంగారక గ్రహంపై మీథేన్ స్థాయిలు గణనీయంగా తగ్గాయని కూడా ఇది వెల్లడించింది. ప్రస్తుతానికి, క్యూరియాసిటీ నాసా యొక్క చురుకైన మార్స్ రోవర్. కాగా, మార్స్ 2020 రోవర్ సైతం రెడ్‌ప్లానెట్‌పైకి వెళ్లనుంది. రెండు రోవర్లు కవలల్లా కనిపించినా ఇవి పూర్తిగా భిన్నంగా ఉంటాయి.. ఈ రెండు రోవర్లు అంగారక గ్రహం గుట్టుమట్లను మరింతగా జనబాహుళ్యానికి చేరవేయనున్నాయి.

చదవండి : నింగిలోకి సోలార్‌ ఆర్బిటర్‌

మరిన్ని వార్తలు