ఘనంగా రెండో రోజు నాటా వేడుకలు

29 May, 2016 10:40 IST|Sakshi
ఘనంగా రెండో రోజు నాటా వేడుకలు

డల్లాస్: అమెరికాలోని డల్లాస్‌లో నార్త్ అమెరికా తెలుగు అసోసియేషన్ (నాటా) కన్వెన్షన్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. శుక్రవారం అట్టహాసంగా ప్రారంభమైన ఈ వేడుకలలో నటి హంసానందిని సందడి చేసింది. రెండో రోజు వేడుకల్లో పాల్గొనేందుకు రాజకీయ, టాలీవుడ్‌కు చెందిన ప్రముఖులు భారీ సంఖ్యలో డల్లాస్ కన్వెన్షన్ సెంటర్కు చేరుకున్నారు. కాగా ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. సంగీత దర్శకుడు కోటి  ఆధ్వర్యంలో జరిగే సంగీత కార్యక్రమంలో గాయకులు హేమచంద్ర, సాయిచరణ్, సాయి శిల్ప, శృతి, శివ దినకర్, నూతన మోహన్, నరేంద్ర తదితరులు ఈ వేడుకల్లో పాల్గొననున్నారు. తాము ఊహించిన దానికన్నా ఎక్కువ స్పందన వచ్చిందని నిర్వాహకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

నాటా అధ్యక్షుడు డాక్టర్ మోహన్ మల్లం,  భవిష్య అద్యక్షుడు రాజేశ్వర్ గంగసాని, మహా సభల కన్వీనర్ డాక్టర్ రమణారెడ్డి గూడూరు, సమన్వయకర్త  రామసుర్యా రెడ్డి, కో కన్వీనర్ డాక్టర్ శ్రీధర్ రెడ్డి, రీజనల్ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ నాగిరెడ్డి దర్గా రెడ్డి అడ్వైజరీ కౌన్సిల్ డాక్టర్ ప్రేమ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ మిథున్ రెడ్డి.. ఏపీ ముఖ్యమంత్రి  చంద్రబాబు అవినీతిపై 'ఎంపరర్ ఆఫ్ కరప్షన్' అనే పుస్తకాన్ని విడుదల చేశారు. అలాగే వైఎస్ఆర్ సీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఈ సందర్భంగా ఆయన ప్రారంభించారు. 

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు