ఉగ్రవాద సంస్థలను చర్చలకు ఆహ్వానించిన షరీఫ్

21 Aug, 2013 13:28 IST|Sakshi
నవాజ్‌ షరీఫ్‌

ఇస్లామాబాద్: పాకిస్తాన్లో శాంతిస్థాపనకు తన ప్రభుత్వం కట్టుబడి వుందని ఆ దేశ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌ మరోసారి స్పష్టం చేశారు. పాకిస్తాన్‌ గడ్డ నుంచి తీవ్రవాదాన్ని తుదముట్టించేంత వరకు అలుపులేని పోరాటం చేస్తామన్నారు.  చర్చలకు రావాలని తీవ్రవాద సంస్థలకు ఆయన పిలుపు ఇచ్చారు. ఆఫ్గనిస్తాన్‌ సరిహద్దుల నుంచి పాకిస్తాన్‌లో ఉగ్రవాద కార్యకలాపాలు నిర్వహిస్తున్న సంస్థలను మూలాలతో సహా పెకలించివేస్తామని హెచ్చరించారు.

శాంతి చర్చలను తిరస్కరిస్తున్న ఉగ్రవాద గ్రూపులు తమ విధానం మార్చుకుని చర్చలకు రావాలని షరీఫ్‌ ఆహ్వానం పలికారు. పొరుగు దేశం భారత్‌తో సంబంధాల గురించి మాట్లాడుతూ.. రెండు దేశాలూ అర్థరహితమైన యుద్ధాల గురించి ఆలోచించడం కంటే, పేదరికం, నిరక్షరాస్యత, వ్యాధులపై పోరాడాల్సిన వాస్తవాన్ని గుర్తించాలన్నారు.

మరిన్ని వార్తలు