'నువ్వొక పిరికిపందవు.. దమ్ముంటే రా..'

29 Dec, 2017 19:41 IST|Sakshi

లాహోర్‌ : పాకిస్థాన్‌ పదవీచ్యుత ప్రధాని నవాజ్‌ షరీఫ్‌ పాక్‌ ఆర్మీ మాజీ చీఫ్‌ పర్వేజ్‌ ముషార్రఫ్‌పై నిప్పులు చెరిగారు. ఆయన ఓ పెద్ద పిరికిపంద అన్నారు. వెంటనే న్యాయ వ్యవస్థ అతడిని వెనక్కు రప్పించి అతడు చేసిన నేరాలన్నింటికి శిక్షలు విధించాలని డిమాండ్‌ చేశారు. ముషార్రఫ్‌ రాజద్రోహానికి పాల్పడ్డాడనే ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. 2007 నవంబర్‌లో పాక్‌లో అత్యవసర పరిస్థితి విధించి ఆయన తప్పు చేశారని, రాజద్రోహానికి పాల్పడ్డారని కేసులు నమోదయ్యాయి.

ఆ సమయంలో ఆయన న్యాయమూర్తులను సైతం అరెస్టు చేయించడమే కాకుండా వారి అధికారాలను కూడా కుదించినట్లు ఆరోపణలు ఉన్నాయి. అవే నిజమని తేలితే ముషార్రఫ్‌కు ఉరి శిక్ష పడుతుంది. 'అనారోగ్యం పేరుతో దుబాయ్‌ వెళ్లి అక్కడే ఉంటున్న ముషార్రఫ్‌ను వెంటనే వెనక్కు రప్పించాలి. అతడో పెద్ద పిరికిపంద. విదేశాల్లో దాక్కుంటున్నాడు. అతడికి ఏమాత్రం ధైర్యం ఉన్న పాక్‌లో అడుగుపెట్టి అతడిపై ఉన్న కేసులు ఎదుర్కోవాలి' అని షరీఫ్‌ను డిమాండ్‌ చేశారు.

>
మరిన్ని వార్తలు