పాకిస్తాన్‌ మాజీ ప్రధాని భార్య మృతి

11 Sep, 2018 18:03 IST|Sakshi
బేగం కుల్‌సుమ్‌ (ఫైల్‌ ఫోటో)

ఇస్లామాబాద్‌ : పాకిస్తాన్‌ మాజీ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌ భార్య బేగం కుల్‌సుమ్‌ షరీఫ్‌ మృతి చెందారు. గత కొంతకాలంగా క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆమె..  2017 నుంచి లండన్‌లోని ఓ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూ మంగళవారం లండన్‌లో మృతి చెందారు. ఈ మేరకు పాకిస్తాన్‌ ముస్లింలీగ్‌-నవాజ్‌ ప్రెసిడెంట్‌ షహాబాజ్‌ షరీఫ్‌ ట్విటర్‌ ద్వారా వెల్లడించారు. 1950లో పాకిస్తాన్‌లో జన్మించిన కుల్‌సుమ్‌ 1971లో నవాజ్‌ షరీఫ్‌ను వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం నవాజ్‌ షరీఫ్‌, ఆమె కుమార్తె మరియమ్‌ రావాల్పిండిలోని అదిలా జైల్‌లో శిక్ష అనుభవిస్తున్న విషయం తెలిసిందే. ఆమె మృతికి పలువురు పాకిస్తాన్‌ జాతీయ నేతలు సంతాపం వ్యక్తం చేశారు.
 

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

బ్లాక్‌లిస్ట్‌లో పాకిస్తాన్‌!

అమెరికాలో కాల్పులు.. ఆరుగురు మృతి 

బార్బీ బొమ్మకు బ్రదర్‌వా..!

మీ ప్రేమకు.. మా ప్రపోజ్‌

బీ మైండ్‌ఫుల్‌ వర్తమానంలో జీవించండి

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

మీ అభిప్రాయాన్ని గౌరవిస్తున్నాం

నవ్వించి పంపించే బాధ్యత మాది

వన్స్‌ మోర్‌?

చాలా రోజుల తర్వాత పాట పాడా

పది సెకన్లు టైమ్‌ ఇస్తే ఏడ్చేస్తా

జోడీ కడుతున్నారు