రూ.కోట్లల్లో ప్రధాని కూమార్తె ఆస్తులు

12 Jul, 2017 12:51 IST|Sakshi
రూ.కోట్లల్లో ప్రధాని కూమార్తె ఆస్తులు

ఇస్లామాబాద్‌: పాకిస్థాన్‌ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌ కూతురు మార్యాం నవాజ్‌పై పనామా కుంభకోణం సంయుక్త విచారణ కమిటీ (జేఐటీ) సంచలన ఆరోపణలు చేసింది. ఆమె తమకు నకిలీ ధృవపత్రాలు సమర్పిస్తున్నారని, ఇది ముమ్మాటికీ క్రిమినల్‌ నేరం అవుతందని ఆగ్రహం వ్యక్తం చేసింది. పనామా గేట్‌ కుంభకోణంలో షరీఫ్‌ కుటుంబానికి పెద్ద మొత్తంలో చోటుందని, దానికి సంబంధించిన విచారణ జరుగుతున్న విషయం తెలిసిందే. పాక్‌లోని జాయింట్‌ ఇన్వెస్టిగేషన్‌ టీం ఈ కేసును విచారిస్తోంది.

అయితే, షరీఫ్‌ కూతురు మార్యాం నవాజ్‌, ఆమె సోదరులు హుస్సేన్‌, హసన్‌ నవాజ్‌, అలాగే ఆమె భర్త కెప్టెన్‌ మహ్మద్‌ సఫ్దార్‌ కూడా తప్పుడు ధ్రువపత్రాలపై సంతకాలు పెట్టి వాటినే సమర్పిస్తూ సుప్రీంకోర్టును పక్కదారి పట్టిస్తున్నారంటూ జేఐటీ ఆరోపించింది. 'మార్యామ్‌ నవాజ్‌కు 2009 నుంచి 2016 మధ్య కాలంలో రూ.73.5మిలియన్‌ల నుంచి రూ.830.73 మిలియన్‌ల వరకు ముట్టాయి' అని కూడా జేఐటీ తెలిపింది. ఎలాంటి ఆదాయం లెక్కలు చూపించకుండానే 1990 నుంచి ఈ మధ్య కాలంలో అనూహ్యంగా ఆమె ఆస్తులు వందల రెట్లు పెరిగాయని కూడా పేర్కొంది. అయితే, దీనిపై షరీఫ్‌ కూతురు స్పందించారు. అసలు విషయం సుప్రీంకోర్టులో తేలుతుందని, అంతకుముందు వచ్చే ఏ మాటలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని అన్నారు.

మరిన్ని వార్తలు