11 ఏట విడిపోయి.. 89 ఏట కలిశారు!

13 Apr, 2018 22:50 IST|Sakshi

76 ఏళ్ల తర్వాత కలిసి.. జ్ఞాపకాలను పంచుకున్న నాజీ బాధితులు 

లాస్‌ఏంజిలెస్‌ : పాలకుల క్రూరత్వానికి ఎందరో బలిపశువులుగా మారారు. అందుకు చరిత్రలో ఎన్నో ఉదాహరణలున్నాయి. ముఖ్యంగా నాజీల కాలంలో చోటుచేసుకున్న దురాగతాలు అన్నీ ఇన్నీ కావు.  ఉన్నవారిని, పెరిగిన ఊరును, దేశాన్నే వదిలి ఎంతోమంది వెళ్లిపోయారు. అలాంటివారిలో ఇద్దరు ప్రాణ స్నేహితులు దాదాపు 76 ఏళ్ల తర్వాత కలిశారు. ఆ వివరాల్లోకెళ్తే.. 1940వ సంవత్సరం.. నాజీలు బెల్జియంను ముట్టడించారు. అప్పటికే ప్రాణ స్నేహితులైన సైమన్, గస్టిల్‌ వెయిట్స్‌ కూడా విడిపోయారు. 

సైమన్‌ కుటుంబం నాజీల చేతిలో బలైపోయింది. దీంతో వెయిట్స్‌ తండ్రి తనకున్న సంపదనంతా నగదుగా మార్చి, క్యూబా వెళ్లే షిప్‌ ఎక్కారు. బ్రసెల్స్‌ వెళ్లి తలదాచుకోవచ్చని భావించారు. అయితే ఇన్నేళ్ల తర్వాత సైమన్‌ కుటుంబంలో మిగతావారంతా చనిపోయినా.. సైమన్‌ మాత్రం బతికే ఉన్నాడని వెయిట్స్‌కు తెలిసింది. దీంతో లాస్‌ ఏంజిలెస్‌లో స్థిరపడిన వెయిట్స్‌.. సైమన్స్‌ ఆచూకీ కోసం ఎంతగానో ప్రయత్నించి, చివరికి జాడ తెలుసుకుంది. లాస్‌ ఏంజిలెస్‌ మ్యూజియం సాక్షిగా ఇద్దరు స్నేహితులు కలుసుకున్నారు. 11 ఏళ్లునప్పుడు విడిపోయిన వీరిద్దరు దాదాపు 89 ఏళ్ల వయసులో కలుసుకొని, కన్నీళ్లతో తమ జ్ఞాపకాలను పంచుకున్నారు. 

మరిన్ని వార్తలు