ఖాతా తెరవండి.. రేంజ్ రోవర్ గెల్చుకోండి

14 Mar, 2016 19:14 IST|Sakshi
ఖాతా తెరవండి.. రేంజ్ రోవర్ గెల్చుకోండి

కువైట్: కువైట్ కు చెందిన బ్యాంక్ ఓ బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఖాతా తెరవండి, ఖరీదైన కారు గెల్చుకోండంటూ ఊరిస్తోంది. బ్యాంకులో ఖాతా తెరిచిన వినియోగారుడు ఈ రేంజ్ రోవర్ రేంజ్ రోవర్ ఎవోక్ ను గెలుచుకునే అవకాశాన్ని నేషనల్ బ్యాంక్ ఆఫ్ కువైట్  కల్పిస్తోంది. 'ట్రాన్ఫర్ యువర్ శాలరీ టు ఎన్‌బీకే అండ్ విన్' పేరిట ప్రత్యేక కార్యక్రమం ద్వారా వినియోగదారులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. అయితే అందుకు కావలసినదల్లా నేషనల్ బ్యాంక్ ఆఫ్ కువైట్‌లో ఖాతా కలిగి ఉండటమే. అన్నట్టు కువైట్ జాతీయులతో పాటు ప్రవాసీయులు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు.

ఎన్బీటీ బ్యాంకు తన కొత్తగా ప్రారంభించిన ఈ పథకం ద్వారా ప్రతి కస్టమర్ తన శాలరీని బ్యాంకు అకౌంట్‌కు ట్రాన్స్ ఫర్ చేయాల్సి ఉంటుంది. అలా ట్రాన్స్ ఫర్ చేసే నగదును వినియోగదారుడు అవసరాలకు ఉపయోగించుకోవచ్చు.  దీంతోపాటుగా ఇపుడు కొత్తగా ఆ బ్యాంకులో ఖాతా తెరిచేవారికి కూడా ఈ అవకాశాన్ని వినియెగించుకోవచ్చు. ఇప్పటికే ఖాతా వున్న వారికి రెండుసార్లు, కొత్తగా ఖాతాను తెరిచిన వినియోగారుడు కేవలం ఒక్కసారి ఈ డ్రాలో పాల్గొనవచ్చని తెలిపింది.

బ్యాంకు రూపొందించిన నిబంధనల ప్రకారం విజేతను ఎంపిక చేస్తారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 14న డ్రా త్రీసి విన్నర్ ను ఎంపిక చేస్తారు. ఈ యేడాది డిసెంబర్ 31 వరకూ ఈ కార్యక్రమంలో పాల్గొనవచ్చు. కస్టమర్లకు మెరుగైన సర్వీసులను అందించేందుకే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని బ్యాంకు అసిస్టెంట్ జనరల్ మేనేజర్ ఘాదీర్ ఐవాడి తెలిపారు.

>
మరిన్ని వార్తలు