అమెరికాను భయపెడుతున్న ‘ప్యాకెట్‌లు’

24 Oct, 2018 20:07 IST|Sakshi

వాషింగ్టన్‌ : అమెరికా అధ్యక్ష భవనం వైట్‌హౌస్‌కి, మాజీ అధ్యక్షుల నివాసాలకు, బిలియనీర్‌ జార్జ్‌ సోరస్‌ ఇంటికి, సీఎన్‌ఎన్‌ మీడియా సంస్థకు అనుమానాస్పద ప్యాకెట్‌లు వస్తున్నాయి. పార్శిల్‌ని విప్పి చూడగా వాటిలో పేలుడు పరికారాలు బయటపడుతున్నాయి. వీటిని చూసిన సీఎన్‌ఎన్‌ ముందు జాగ్రత్త చర్యగా ఫైర్‌ అలారమ్‌ మోగించి తన సిబ్బందిని బయటకు పంపించింది. 

తొలుత ఈ ప్యాకెట్‌లు మంగళవారం బిల్‌ క్లింటన్‌ నివాసానికి, బుధవారం ఒబామా నివాసానికి వచ్చాయని ఎఫ్‌బీఐ ప్రకటించింది. అయితే ఈ ప్యాకెట్‌లు వచ్చిన సమయంలో హిల్లరి దంపతులు ఇంట్లో ఉన్నారా లేదా అనే విషయం గురించి ఎటువంటి సమాచారం తెలియలేదు. వీటి గురించి దర్యాప్తు కొనసాగుతుందని ఎఫ్‌బీఐ అధికారులు ట్విట్టర్‌ ద్వారా ప్రకటించారు.

అయితే మాజీ అధ్యక్షులు, ప్రముఖుల ఇళ్లకు వస్తోన్న ఈ అనుమానాస్పద ప్యాకెట్‌ల అంశాన్ని వైట్‌ హౌస్‌ ఖండించింది. ఇలాంటి భయపెట్టే చర్యలు చట్ట వ్యతిరేకమైనవని, అసహ్యమైనవని పేర్కొంది. వీటికి పాల్పడే వారు ఎవరైనా సరే.. తగిన మూల్యం చెల్లిస్తారని హెచ్చరించింది. అంతేకాక ఈ ప్యాకెట్‌ వచ్చిన వారందరికి భద్రత కల్పిస్తామని వెల్లడించింది.

మరిన్ని వార్తలు