నేపాల్ లో ఆహార కరువు!

20 Jun, 2015 10:24 IST|Sakshi
నేపాల్ లో ఆహార కరువు!

యునైటెట్ నేషన్స్: ఇటీవల నేపాల్ లో వచ్చిన రెండు భారీ భూకంపాల ధాటికి ఆ దేశం అల్లాడిపోతోంది. భూప్రళయాలు భారీ విధ్వంసం సృష్టించి సుమారు తొమ్మిది వేల మంది పొట్టనపెట్టుకున్నాయి. దీంతో పాటు అక్కడ వ్యవసాయరంగం పూర్తిగా చిన్నాభిన్నంగా మారింది.  ప్రస్తుతం ఆహార భద్రత కూడా ఆ దేశంలో తీవ్ర ముప్పుగా పరిగణించే అవకాశం ఉందని ఎఫ్ఏఓ(ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్)తాజాగా ఆందోళన వ్యక్తం చేసింది. నేపాల్ లో మూడొంతులకు రెండొంతుల ప్రజలు రైతులేనని  స్పష్టం చేసింది.  వారు ప్రధానంగా వ్యవసాయ రంగంపైనే ఆధారపడటంతో  ప్రస్తుత సీజన్ లో పంటలకు ఆర్థికసాయం ఇవ్వాలని ఎఫ్ఏఓ పేర్కొంది. నేపాల్ లో ప్రధానంగా దెబ్బతిన్న ఆరు జిల్లాల్లో ఈ ముప్పు అధికంగా ఉండటంతో తిరిగి రైతులు వ్యవసాయ పనులు పునరుద్ధరించటానికి 23 మిలియన్ డాలర్లు( సుమారు రూ.13 వేల కోట్లు ) అవసరమని ఐక్యరాజ్యసమితికి ఎఫ్ఏఓ విజ్ఞప్తి చేసింది.

 

అయితే ఇప్పటివరకూ మూడు మిలియన్ డాలర్లు మాత్రమే సాయంగా అందాయని.. ఇంకా 20 మిలియన్ డాలర్లు అవసరమని ఎఫ్ఏఓ తెలిపింది. త్వరతగతిన ఆ దేశంలో వ్యవసాయ రంగానికి సంబంధించి సహాయక చర్యలు చేపట్టకపోతే పది లక్షల మంది ప్రజలకు పైగా ఆహార సమస్యను ఎదుర్కోకతప్పదని ఎఫ్ఏఓ నిపుణులు హెచ్చరిస్తున్నారు.

>
మరిన్ని వార్తలు