-

‘20,000 మంది మృత్యువాత’

5 Apr, 2020 16:29 IST|Sakshi

లండన్‌ : కరోనా మహమ్మారి వ్యాప్తిని కట్టడి చేసేందుకు చర్యలు చేపడుతున్నా బ్రిటన్‌లో ఈ వైరస్‌ బారిపపడి మరణించే వారి సంఖ్య 7,000 నుంచి 20,000 మధ్య ఉండే అవకాశం ఉందని లండన్‌కు చెందిన ఇంపీరియల్‌ కాలేజ్‌ ప్రొఫెసర్‌ నీల్‌ ఫెర్గూసన్‌ అన్నారు. ఇన్ఫెక్షన్లు విపరీతంగా పెరుగుతున్నాయని నిర్ధిష్ట సమయంలో వీటిని నిరోధించాలని బీబీసీ కార్యక్రమంలో మాట్లాడుతూ ఆయన పేర్కొన్నారు. ఎంతమంది ప్రజలకు వైరస్‌ సోకిందో స్పష్టంగా ఇప్పుడు వెల్లడించలేమని, పరీక్షలు ముమ్మరంగా జరుపుతూ వాటి గణాంకాలను విశ్లేషిస్తున్నామని చెప్పుకొచ్చారు.

ఏమైనా కరోనా మహమ్మారితో బ్రిటన్‌లో 7000 నుంచి 20,000 మంది మృత్యువాతన పడతారని ఆయన అంచనా వేశారు. బ్రిటన్‌ యంత్రాంగం కరోనాను ఎదుర్కొనే క్రమంలో నీల్‌ ఫెర్గూసన్‌ ప్రభుత్వానికి కీలక సలహాదారుగా పనిచేస్తున్నారు. కాగా బ్రిటన్‌లో ఇప్పటివరకూ 41,900 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కాగా 4300 మంది మరణించారు.

చదవండి : కరోనా : ఆరు నిమిషాల వ్యవధిలోనే

మరిన్ని వార్తలు