రంజాన్ రోజు పెద్ద ప్రమాదం తప్పింది

7 Jul, 2016 15:23 IST|Sakshi
రంజాన్ రోజు పెద్ద ప్రమాదం తప్పింది

ఖాట్మాండు: నేపాల్ ఎయిర్ లైన్స్ విమానానికి గురువారం ప్రమాదం తప్పింది. త్రిభువన్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి 60 మంది ప్రయాణికులతో హాంగ్ కాంగ్ కు బయలు దేరిన విమానం కొద్దిసేపటికే అత్యవసరంగా కిందకు దిగింది. నేపాల్ ఎయిర్ కార్పొరేషన్(ఎన్ఏసీ)కు చెందిన ఎయిర్ బస్ ఏ320 గాల్లోకి ఎగిరిన కొద్ది నిమిషాలకే పక్షి ఢీకొనడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. దీంతో విమానాన్ని మళ్లీ వెనక్కు తీసుకొచ్చి విమానాశ్రయంలో సురక్షితంగా కిందకు దించారు.

ఉదయం 10 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుందని విమానాశ్రయ అధికారులు తెలిపారు. ప్రయాణికులెవరూ గాయపడలేదని, వారిని మరో విమానంలో పంపించినట్టు చెప్పారు. విమానం ఢీకొనడంతో విమానం ఇంజిన్  బాగా దెబ్బతిందని వెల్లడించారు. ఈ సంఘటనతో పలు విమానాల రాకపోకలు ఆలస్యమయ్యాయి. రంజాన్ పర్వదినం రోజున పెద్ద ప్రమాదం తప్పడంతో అధికారులు, ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.

మరిన్ని వార్తలు