మధ్యవర్తిగా ఉంటాం..

26 Jan, 2020 04:46 IST|Sakshi

కఠ్మాండు: భారత్, పాకిస్తాన్‌ల మధ్య విభేదాల పరిష్కారంలో మధ్యవర్తిగా వ్యవహరించేందుకు నేపాల్‌ ముందుకువచ్చింది. రెండు దేశాల మధ్య దెబ్బతిన్న సంబంధాలను పునరుద్ధరించడం ద్వారా సార్క్‌(దక్షిణాసియా దేశాల ప్రాంతీయ సహకార సమాఖ్య)ను పునరుత్తేజం చేస్తామని తెలిపింది. శాంతియుత చర్చల ద్వారా ఎలాంటి సమస్య అయినా పరిష్కారం అవుతుందని సార్క్‌ చైర్మన్‌గా ఉన్న నేపాల్‌ పేర్కొంది.

మరిన్ని వార్తలు