తొలిసారిగా జెండర్‌ న్యూట్రల్‌ పాస్‌పోర్ట్‌

23 Oct, 2018 16:24 IST|Sakshi

ఆమ్‌స్టర్‌డ్యామ్‌: నెదర్లాండ్‌ ప్రభుత్వం చారిత్రత్మక నిర్ణయం తీసుకుంది. ప్రపంచంలోనే తొలిసారిగా జెండర్‌ న్యూట్రల్‌ పాస్‌పోర్ట్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. మాములుగా నెదర్లాండ్‌ పాస్‌పోర్ట్‌లలో మగవారికి (మనెట్జె-m) అని, ఆడవారికి(వ్రువు-v) అని సూచిస్తారు. కానీ ఇకపై జెండర్‌ న్యూట్రల్‌ పాస్‌పోర్ట్‌లలో వాటి స్థానంలో ’x’ గుర్తును ఉంచనున్నారు. ఈ రకానికి చెందిన తొలి పాస్‌పోర్ట్‌ను 57ఏళ్ల లియోనే జేగేర్స్‌కు అందజేశారు.    

చిన్నతనం నుంచి బాలుడిగా పెరిగిన లియోనే జేగేర్స్ తనకు యుక్తవయస్సు వచ్చే సరికి తనలో స్త్రీ భావాలు ఉన్నట్టు గుర్తించారు. ఆ తర్వాత 2001లో లింగమార్పిడి ఆపరేషన్‌ చేయించుకున్నారు. గతంలో క్రీడల్లో రాణించిన లియోనే.. ప్రస్తుతం నర్సుగా పనిచేస్తున్నారు. కాగా, ఇటీవల తన ఆస్థిత్వం విషయంలో లియోనే కోర్టును ఆశ్రయించారు. ఆమె పిటిషన్‌పై విచారణ జరిపిన ధర్మాసనం.. జెండర్‌ న్యూట్రల్‌గా రిజస్టర్‌ చేసకోవడాన్ని నివారించడం ద్వారా..  వ్యక్తిగత స్వేచ్ఛకు, ఆత్మ అభిమానానికి భంగం కలిగేలా చేయడమేనని తీర్పు వెలువరించింది. ఆడ, మగ కానీ వారిని థర్డ్‌ జెండర్‌గా పేర్కొనాలని ఆదేశించింది. కోర్టు ఆదేశాలతో నెదర్లాండ్‌ విదేశాంగ శాఖ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. కాగా, ఆస్ట్రేలియా, భారత్‌, కెనడా, పాకిస్తాన్‌, డెన్మార్క్‌, న్యూజిలాండ్‌, మల్టాలు పాస్‌పోర్ట్‌ అప్లికేషన్‌లో జెండర్‌ న్యూట్రల్‌ అప్షన్‌ను ఎంచుకునే అవకాశాన్ని కల్పిస్తున్నాయి.

మరిన్ని వార్తలు