చెర్నోబిల్ చుట్టూ రాతి నిర్మాణాలు

17 Apr, 2016 22:28 IST|Sakshi
చెర్నోబిల్ చుట్టూ రాతి నిర్మాణాలు

కీవ్: ప్రపంచంలో అత్యంత దురదృష్టకర న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ప్రమాదంగా చెప్పుకునే చెర్నోబిల్ విషాదానికి ఏప్రిల్ 26తో 30 ఏళ్లు నిండనున్నాయి. ఈ ఘటన జరిగి 3 దశాబ్దాలు కావస్తున్నప్పటికీ ఆ విషాదం వారిని వెంటాడుతూనే ఉంది. ఈ సందర్భంగా ఉక్రెయిన్ ప్రభుత్వం నాడు పేలిన రియాక్టర్ చుట్టూ రాతితో నిర్మితమైన పెట్టెలను అమర్చాలని నిర్ణయించుకుంది. రియాక్టర్‌లో ఇంకా 200 టన్నుల యూరేనియం నిల్వ ఉండండంతో పాటు దాని చుట్టూ ఉన్న కాంక్రీటు నిర్మాణం ఇప్పటికే పాతబడింది.

దాని నుంచి ఎప్పుడైనా రేడియో ధార్మిక కిరణాలు విడుదలయ్యే ప్రమాదం ఉండడంతో అక్కడి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. వీటికి నిధులను సమకూర్చే విషయమై చర్చించేందుకు అంతర్జాతీయ దాతలు ఈ నెల 25న సమావేశం కానున్నారు. 1986 ఏప్రిల్ 26న సంభవించిన ఈ ప్రమాదంలో ఎంత మంది మరణించారన్న లెక్కలు ఇప్పటికీ తేలలేకపోవడం గమనార్హం. ఐరోపాలో మూడు వంతుల భూభాగాన్ని ఈ ఘటన ప్రభావితం చేసింది.

మరిన్ని వార్తలు