తినేప్పుడే తెరుచుకునే మాస్క్‌!

20 May, 2020 00:41 IST|Sakshi

జెరూసలేం: కరోనా వైరస్‌ వ్యాప్తిని అడ్డుకునే క్రమంలో వినూత్నమైన ఆవిష్కరణలు తప్పనిసరి. అందులోభాగంగా ‘తినేటప్పుడే తెరుచుకునే మాస్క్‌’ను రూపొందించారు ఇజ్రాయెల్‌ శాస్త్రవేత్తలు. భోజనం చేసేటపుడు మూతికున్న మాస్క్‌ను తప్పకుండా తొలగించాల్సిందే. ఆ సమయంలో గాల్లో వ్యాపించిన వైరస్‌ ముక్కుగుండా శరీరంలోకి వెళ్తుంది. అలా జరగకుండా ఉండేందుకు ముక్కుకు మాస్క్‌ అలాగే ఉండి.. నోటి వద్ద మాత్రమే తెరుచుకునేలా కొత్తతరహా మాస్క్‌ను శాస్త్రవేత్తలు అభివృద్ధిచేశారు. చేతిలో ఇమిడే చిన్న రిమోట్‌తో దీన్ని ఆపరేట్‌ చేయొచ్చు. ‘ఐస్‌క్రీమ్, సాస్‌ వంటి ద్రవాహారాలు తీసుకునేటప్పుడు కాస్త ఇబ్బందిపడినా.. ఘనాహారాన్ని ఎలాంటి ఇబ్బందిలేకుండా తీసుకోవచ్చు’ అని టెల్‌అవీవ్‌లోని అవ్‌టీపస్‌ పేటెంట్స్, ఇన్వెంటర్స్‌ ఉపాధ్యక్షుడు అసఫ్‌ గిటెలిస్‌ చెప్పారు. ఒక్కోటి రూ.215లకు అమ్మాలని కంపెనీ యోచిస్తోంది.

>
మరిన్ని వార్తలు