అత్యంత తేలికైన బంగారం

27 Nov, 2015 12:02 IST|Sakshi
అత్యంత తేలికైన బంగారం

జెనీవా: అత్యంత తేలికైన 20 కేరట్ల బంగారాన్ని స్విట్జర్‌లాండ్ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. దీనితో చేసిన ఆభరణాలు ప్రస్తుతం మనం చూస్తున్న బంగారం కన్నా దాదాపు వెయ్యి రెట్లు తేలికగా ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ బంగారం  గాలి మాదిరి తేలికగా ఉంటుందని ఈటీహెచ్ జురిచ్ యూనివర్సిటీ పరిశోధకుడు రఫేల్ మెజెంగా పేర్కొన్నారు.

ఈ బంగారంలో 98 భాగాలు గాలి మాత్రమే ఉంటుంది. 2 భాగాలే ఘన పదార్థం(బంగారం) ఉంటుంది. ఈ పదార్థంలో కూడా ఐదింట నాలుగు భాగాలు మాత్రమే బంగారం ఉంటుంది. శాస్త్రవేత్తలు ముందుగా అమైలాయిడ్ ప్రోటీన్స్‌ను వేడి చేసి నానోమీటర్ సైజులో ఉండే ప్రోటీన్ తంత్రులను తయారుచేసి బంగారం ఉన్న ద్రవంలో ఉంచటంతో. జెల్ వంటి పదార్థం ఏర్పడింది.
 

మరిన్ని వార్తలు