జాధవ్‌ కేసులో కొత్త లాయర్లు

20 May, 2017 01:23 IST|Sakshi
జాధవ్‌ కేసులో కొత్త లాయర్లు

ఇస్లామాబాద్‌: కుల్‌భూషణ్‌ జాధవ్‌ కేసుకు సంబంధించి అంతర్జాతీయ న్యాయస్థానం (ఐసీజే)లో ఎదురైన పరాభవంతో పాకిస్తాన్‌ ప్రభుత్వం తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది. ప్రతిపక్షాలు, మీడియాతో పాటు న్యాయ నిఫుణులు సైతం ఈ వ్యవహారంలో ప్రభుత్వం అనుసరించిన తీరును తప్పుపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఐసీజేలో జాధవ్‌ కేసు కోసం కొత్త న్యాయవాదుల బృందాన్ని ఏర్పాటు చేయాలని పాక్‌ సర్కారు నిర్ణయించింది.

ఈ విషయాన్ని పాకిస్తాన్‌ ప్రధాని విదేశీ వ్యవహారాల సలహాదారు సర్తాజ్‌ అజీజ్‌  వెల్లడించారు. హేగ్‌లోని అంతర్జాతీయ న్యాయస్థానం జాధవ్‌ మరణశిక్షను నిలుపుదల చేస్తూ గురువారం తీర్పు చెప్పిన సంగతి తెలిసిందే. తుది తీర్పు వచ్చే వరకూ మరణశిక్షను అమలు చేయవద్దని ఐసీజే ఆదేశించింది. జాధవ్‌ కేసులో ఎఫ్‌ఓ సక్రమంగా వ్యవహరించలేదని, ఈ కేసు కోసం బ్రిటన్‌కు చెందిన ప్రముఖ న్యాయవాది ఖావర్‌ ఖురేషీని ఎంచుకోవడాన్ని ప్రతిపక్షాలు, నిఫుణులు తప్పుపట్టారు.   కాగా, జాధవ్‌ కేసులో పునర్విచారణ చేపట్టాలంటూ పాక్‌ ఐసీజేలో శుక్రవారం పిటిషన్‌ వేసింది.

మరిన్ని వార్తలు