భూకంపాలొస్తే అలర్ట్ చేసే యాప్!

22 May, 2016 12:37 IST|Sakshi
భూకంపాలొస్తే అలర్ట్ చేసే యాప్!

లాస్ ఏంజెలిస్: సరికొత్త మొబైల్ యాప్ ను కాలిఫోర్నియా, బెర్కెలీ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు రూపొందించారు. భూకంపాలు సంభవించినప్పుడు ముందుగానే ఈ యాప్ అలర్ట్ చేస్తుంది. కిలోమీటర్ల పరిధిలో భూ ప్రకంపనలు సంభవిస్తే వెంటనే మొబైల్ యాప్ నుంచి మనం విషయాన్ని పసిగట్టవచ్చని వారు చెబుతున్నారు. ఆ యాప్ పేరు మై షేక్. రాత్రి, పగలు అనే లేకుండా సిగ్నల్స్ ఇవ్వడం ఆ యాప్ ప్రత్యేకథ. గత మూడు నెలల్లో చిలీ, అర్జెంటైనా, మెక్సికో, జపాన్, తైవాన్, న్యూజీలాండ్, నేపాల్, మొరాకో, ఇతర దేశాలలో భూకంపాలు సంభవించినప్పుడు మై షేక్ యాప్ వర్క్ చేసింది.

గ్లోబల్ పోజిషనింగ్ సిస్టమ్(జీపీఎస్) కూడా అలర్ట్ రావడంతో హెల్ప్ చేస్తుందని, ఈ ఫిబ్రవరిలో తొలిసారిగా ప్రయోగం ఫలించిందని వర్సిటీ సైంటిస్టులు వెల్లడించారు. అదే సమయంలో 1.7 లక్షల మంది ఈ యాప్ ను డౌన్ లోడ్ చేసుకున్నారని, అందులో 11 వేల ఫోన్ల సమాచారాని తమ డాటా నెట్ వర్క్ కు అనుసంధానం చేసినట్లు చెప్పారు. రిక్టర్ స్కేలుపై 2.5 నుంచి అధిక తీవ్రత భూకంపాలపై అలర్ట్ సౌకర్యాన్ని వినియోగించుకోవచ్చునని వివరించారు. ఏప్రిల్ 16న ఈక్వెడార్ లో సంభవించిన 7.8 తీవ్రత భూకంపాన్ని కూడా ఈ యాప్ గుర్తించిందని, భవిష్యత్తులో తక్కువ ఖర్చుతో చేసిన సెన్సార్ ఉన్న స్మార్ట్ ఫోన్లలో మై షేక్ యాప్ ఇన్ స్టాట్ చేసుకోవచ్చని చెప్పారు. కొన్ని రోజుల్లో మరింత సమాచారం అందజేస్తామని వర్సిటీ సైంటిస్టులు పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు