అణ్వాయుధ పరీక్షలను ఇట్టే పట్టేస్తుంది!

1 Feb, 2016 20:15 IST|Sakshi
అణ్వాయుధ పరీక్షలను ఇట్టే పట్టేస్తుంది!

వాషింగ్టన్: ఇటీవల ఉత్తర కొరియా అణ్వాయుధ పరీక్షలు నిర్వహించి ప్రపంచాన్ని నివ్వెరపరిచింది. అంతర్జాతీయంగా భూప్రకంపనలను కొలిచే సమగ్ర అణ్వాయుధ పరీక్షల నిరోధ ఒప్పంద సంస్థ (సీటీబీటీవో) కొరియా దుందుడుకు చర్యను అందరికంటే ముందే ప్రపంచానికి వెల్లడించింది. అప్పటివరకు ఉత్తర కొరియా అణ్వాయుధ పరీక్షలు నిర్వహించినట్టు ప్రపంచానికి తెలియలేదు. అయితే, సీటీబీటీవో పెద్ద ఎత్తున జరిగే అణు పరీక్షలను మాత్రమే గుర్తించగలదు. మరీ ఉగ్రవాదులు, ప్రభుత్వేతర శక్తులు చిన్నస్థాయిలో చేపట్టే అణ్వాయుధ పరీక్షలను గుర్తించేది ఎలా? అంటే.. అందుకు సమాధానంగా తాజాగా శాస్త్రవేత్తలు ఓ కంప్యూటర్ సాఫ్ట్ వేర్ ను రూపొందించారు.

ఉగ్రవాదులు, ప్రభుత్వేతర శక్తులు అక్రమంగా నిర్వహించే చిన్నపాటి అణ్వాయుధ పరీక్షలను సైతం ఈ సాఫ్ట్ వేర్ గుర్తిస్తుంది. ఏ అణ్వాయుధ పరీక్ష కూడా ప్రపంచానికి తెలియకుండా రహస్యంగా జరుగకూడదన్న సీటీబీటీవో పిలుపునకు అనుగుణంగా అమెరికాలోని బ్రౌన్ యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఎరిక్ సడర్త్ ఈ సాఫ్ట్ వేర్ రూపొందించారు. వర్టికల్లీ ఇంటిగ్రేటెడ్ సీస్ మిక్ అనలసిస్ (విసా) పేరిట రూపొందించిన ఈ సాఫ్ట్ వేర్ గుర్తించడానికి వీలులేకుండా చిన్నస్థాయిలో జరిగే అణ్వాయుధ పరీక్షలను సైతం గుర్తిస్తుంది.
 

మరిన్ని వార్తలు