ఎలుకలు, బొద్దింకల్లో జీపీఎస్!

11 Jul, 2016 13:44 IST|Sakshi
ఎలుకలు, బొద్దింకల్లో జీపీఎస్!

వాషింగ్టన్: కొత్త పరిసరాలను కనుక్కోవడానికి ఎలుకలు, బొద్దింకలు తమ మెదళ్లలో ఉన్న గ్లోబల్ పొషిషనింగ్ సిస్టమ్ (జీపీఎస్) వంటి విధానాన్ని ఉపయోగిస్తాయని తాజా అధ్యయనంలో వెల్లడైంది. మానవులలాగే వివిధ జంతువులు కూడా ఈ పద్ధతిని వినియోగిస్తున్నాయని పరిశోధకులు తెలిపారు.

బొద్దింకలు తమని తాము ఎలా నావిగేట్ చేసుకుంటాయన్న దానిపై శాస్త్రవేత్తలు పరిశోధన చేశారు. క్షీరదాలు కొత్త ప్రాంతానికి వెళ్లినపుడు, ఏ దిశలో వెళ్లాలో తెలియక చుట్టూ మార్గాన్ని వెతుక్కుంటాయనని అమెరికాలోని కేస్ వెస్టర్న్ రిజర్వ్ వర్సిటీ ప్రొఫెసర్ రాయ్ రిజ్మన్ తెలిపారు. మానవుడితోపాటు క్షీరదాలన్నీ మెదడు సంకేతాలపై ఆధారపడి సాగుతాయన్నారు.

మరిన్ని వార్తలు