బ్రిటన్ బామ్మకు శుభాకాంక్షల వెల్లువ

18 Jan, 2016 22:04 IST|Sakshi
బ్రిటన్ బామ్మకు శుభాకాంక్షల వెల్లువ

ఆమె... మొదటి ప్రపంచయుద్ధ సమయంలో టీనేజర్. కూలిపోయిన మొదటి జెపెలియన్ విమానాన్ని ప్రత్యక్షంగా చూసిన వ్యక్తి. పియానో వాయిద్యంలోనూ ఆరితేరిన అనుభవశాలి. ఎన్నో చారిత్రక విషయాలు, విశేషాలు కళ్ళారా చూసి, మనసునిండా మూటగట్టుకుని 112 ఏళ్ళ సుదీర్ఘ జీవితాన్ని దాటింది. ప్రస్తుతం 113 వ పడిలోకి అడుగిడి.. బ్రిటన్ లోనే అత్యంత వృద్ధురాలుగా రికార్డులకెక్కి  ప్రజల సుభాకాంక్షలు అందుకుంటోంది.

రైట్ బ్రదర్స్ విజయవంతంగా విమానాన్ని కనుగొన్న సమయంలో పుట్టిన గ్లాడీస్ హూపర్... కేక్ ముక్క తిని, టీ తాగుతూ హాయిగా తన పుట్టిన రోజు వేడుకలను నిర్వహించుకుంది. ఇంగ్లాండ్ ఇస్లే ద్వీప ప్రాంతం రైడ్ నగరంలోని ఓ నర్సింగ్ హోమ్ లో జరిగిన ఆమె 113 వ పుట్టిన రోజు వేడుకలకు.. కుటుంబ సభ్యులు, స్నేహితులతోపాటు.. దేశవ్యాప్తంగా ఎంతోమంది అతిథులు హాజరయ్యారు. దేశంలో అత్యంత వయసు కలిగిన మహిళగా గుర్తింపు పొందిన అనంతరం మిసెస్ హూపర్ కు హిప్ రీప్లేస్ మెంట్ అవసరమని వైద్యుల ఆదేశాల మేరకు గత అక్టోబర్ లో  నర్సింగ్ హోమ్ లో చేర్పించారు. ఆస్పత్రిలో చేరే ముందు ఆమె 85 ఏళ్ళ కుమారుడు హర్మిస్టాన్ ఇంట్లోనే ఉండేవారు.

బ్రిటన్ దగ్గరలోని రొట్టింగ్ డీన్ లో పెరిగిన ఆమె.. మొదటి ప్రపంచ యుద్ధం సమయానికి యుక్త వయసులో ఉంది. నాజీలు పోలాండ్ ను ఆక్రిమించుకొని రెండో ప్రపంచ యుద్ధం మొదలైన సమయంలో ఆమెకు 36 ఏళ్ళు. 1916 లో లండన్ పై బాంబు దాడి సందర్భంగా కూలిపోయిన మొదటి జర్మన్ ఎయిర్ షిప్ ను తన తల్లి  ప్రత్యక్షంగా చూశారని మిస్టర్ హార్మిస్టాన్ చెప్తున్నారు. అంతేకాక ఆమెకు కాలేజీలో ఎంతోమంది మంచి స్నేహితులు ఉండేవారని, బ్రిటన్ నుంచి ఆస్ట్రేలియా కు సోలోగా విమానాన్ని నడిపిన ఫస్ట్ ఫిమేల్ పైలట్  ఆర్మీ జాన్సన్ తన తల్లికి మంచి ఫ్రెండ్ అని ఆయన చెప్తున్నారు. అప్పట్లో హూపర్ ప్రముఖ పియానో విద్వాంసురాలుగా ఎంతోమంది ప్రముఖులతో కలిసి కచేరీలు ఇచ్చేవారని చాలా కచేరీలకు తాను కూడ వెళ్ళానని అన్నారు.  హూపర్ 1922  లో లెస్లీని  వివాహం చేసుకున్నారు. 1998 లో ఆయన మరణించారని అప్పటినుంచీ ఆమె తమవద్దే ఉంటున్నారని చెప్పారు. హూపర్ మొదటి లండన్ కార్ హైర్ కంపెనీని పెడదామనుకున్నారని, ఆ తర్వాత... ఇప్పుడు బ్రిటన్ కాలేజ్ గా మారిన కింగ్స్ క్లిఫ్ హౌస్ స్కూల్ ను స్థాపించినట్లు చెప్పారు.  

నేను ఆమెను చిన్నతనంనుంచే చూస్తున్నానని, ఇప్పటికీ  ఆమెను చూస్తే ఎంతో గర్వంగా అనిపిస్తుందని హూపర్ మరో కుమారుడు.. రిటైర్డ్ పైలట్ డెరెక్ అంటున్నారు. అప్పట్లో ఆమె ఎన్నో పార్టీల్లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచేవారన్నారు. గొప్ప పియానో విద్యాంసురాలైన ఆమె...  లండన్ డార్చెస్టర్ హోటల్ లో కచేరీ చేస్తున్నప్పుడు ఎన్నోసార్లు చూశానని చెప్పారు. ఇప్పటికీ ఆమె చేతులు కిందికి పైకీ కదిలించడం చూస్తే.. ఆమె సంగీత జీవితాన్నిగుర్తుచేసుకుంటున్నట్లుగా అనిపిస్తుందని, మ్యూజిక్ ఆమెకు ఎంతో సంతోషమైన, ఆరోగ్యకరమైన జీవితాన్నిచ్చిందని, భవిష్యత్తు కూడ ఆమెకు అంతే ఆనందంగా హాయిగా సాగిపోవాలని కోరుకుంటున్నామని ఆమె కుమారులు చెప్తున్నారు.

మరిన్ని వార్తలు