ఇదో రకం బ్యాండ్‌ ఎయిడ్‌

14 Aug, 2019 03:44 IST|Sakshi

గాయమైతే కట్టుకునే బ్యాండ్‌ ఎయిడ్‌ మీకు తెలుసుగా.. ఫొటోలోని వ్యక్తి వేళ్ల మధ్య ఉన్నది కూడా అలాంటిదే. కాకపోతే ఇది గాయాలను కాకుండా.. నొప్పులను తగ్గిస్తుంది. ఈ పట్టీని శరీరంపై నొప్పి ఉన్న చోట అతికించుకుంటే చాలు.. దీనికి అనుసంధానమై ఉన్న మాత్రల నుంచి నొప్పిని తగ్గించే మం దులు నెమ్మదిగా విడుదలవుతాయి. స్విట్జర్లాండ్‌లోని లూజానే యూనివర్సిటీకి చెందిన సంస్థ ఈపీఎఫ్‌ఎల్‌ దీన్ని అభివృద్ధి చేసింది. కేవలం 3 మిల్లీమీటర్ల వెడల్పు, రెండు మైక్రాన్ల మందం ఉండే ఈ పట్టీ మెగ్నీషియంతో తయారైంది. వాస్తవానికి ఇందులో ఓ ఎల్రక్టానిక్‌ సర్క్యూట్‌ ఉంటుంది.  విద్యుదయస్కాంత క్షేత్రంలో కరెం టును పుట్టించడం ద్వారా వేడి పుట్టి.. క్యాప్సూల్‌లో ఉన్న మందు విడుదలవుతుంది. కావాల్సి న సమయానికి, అవసరమైన చోట మాత్రమే మందులు కచి్చతంగా విడుదల చేయడం.. వేర్వేరు మందులను పద్ధతి ప్రకారం అందేలా చేయడం దీని ప్రత్యేకత. ఆపరేషన్ల తర్వాత నొప్పి తగ్గించేందుకు ఇచ్చే మందుల వల్ల దుష్ప్రభావాలు ఉంటాయన్నది మనకు తెలిసిందే. వీటిని తగ్గించేందుకు ఈ పరికరం ఉపయోగపడుతుంది. ఈ పరికరాన్ని పూర్తిస్థాయి లో వాడుకునేందుకు ఇంకా సమయం పట్టే అవకాశం ఉంది.  క్యాప్సూల్స్‌ను ఈ పరికరానికి అనుసంధానించడం.. పరీక్షించడం వంటి పనులు ఇంకా జరగాల్సి ఉంది.   

>
మరిన్ని వార్తలు