జాగింగ్ కు వెళ్లిన మహిళ హత్య

4 Aug, 2016 11:03 IST|Sakshi
జాగింగ్ కు వెళ్లిన మహిళ హత్య

న్యూయార్క్: జాగింగ్ కు వెళ్లిన మహిళ హత్యకు గురైన ఘటన న్యూయార్క్ లో సంచలనం రేపింది. కత్రినా వెట్రానో(30) అనే మహిళ మార్క్ లాండ్ పార్క్ లో మంగళవారం హత్యకు గురైంది. ఆమెను గొంతు పిసికి హత్య చేసినట్టు పోలీసులు గుర్తించారు. ఆమెపై అత్యాచారం జరిగిందని పోలీసులు అనుమానిస్తున్నారు.

హోవార్డ్ బీచ్ కు సమీపంలో నివాసముంటున్న కత్రినా వెట్రానో మంగళవారం సాయంత్రం  5 గంటల ప్రాంతంలో జాగింగ్ కు వెళ్లింది. రోజూ తండ్రి ఫిలిప్ తో పాటు ఆమె జాగింగ్ కు వెళ్లేంది. వెన్నునొప్పిగా కారణంగా ఆయన జాగింగ్ కు వెళ్లలేదు. ఒంటరిగా వెళ్లొద్దని తండ్రి వారించినా ఆమె జాగింగ్ కు వెళ్లింది.

ఫోన్ కాల్కు స్పందించకపోవడం, చాలాసేపైనా ఇంటికి కూతురు ఇంటికి తిరిగి రాకపోవడంతో ఆయన 911 నంబర్ కు ఫోన్ చేశారు. పార్క్ లో పొదలపాటున ఆమె మృతదేహాన్ని పోలీసులు కొనుగొన్నారు. హంతకులను గుర్తించేందుకు సీసీ కెమెరా వీడియోలను పరిశీలిస్తున్నారు. ఫోరెన్సిక్ ఆధారాలు కూడా సేకరించారు.

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు