పట్టు జారిందా అంతే సంగతులు

5 Jan, 2018 16:12 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : అమెరికాలోని న్యూయార్క్‌ సిటీ పేరు వినగానే ఆ సిటీ గొప్పతనాన్ని తెలియజేసే నిద్రపోని నగరం అని, ఆధునిక కాస్మోపాలిటన్‌ నగరం అని, భిన్న సంస్కృతులు ఉట్టిపడే ఓ ప్రత్యేక నగరం అనే మాటలు మనకు గుర్తుకు వస్తాయి. అంతకన్నా ప్రపంచంలోనే ఎత్తైన భవనాలు కలిగిన మొట్టమొదటి నగరం అని విషయం గుర్తుకు రాదు. భవనాల నిర్మాణంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి రావడంతో నేడు ప్రపంచంలో అనేక దేశాలు ఎత్తైన భవనాలను నిర్మించడంలో పోటీపడి ముందుకు దూసుకుపోతున్నాయి. 

న్యూయార్క్‌ సిటీలో తొలుత ఎత్తైన భవనాలను నిర్మించినప్పుడు ఈ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో లేదు. అయినప్పటికీ నాటి కార్మికులు ప్రాణాలకు తెగించి ప్రమాదం అంచుల్లో నిలబడి ఇలాంటి
భవనాలను నిర్మించారు. ఆకాశమంత ఎత్తుకు భారీ స్తంభాలను తాళ్లుకట్టి తమదైన పద్ధతిలో తీసుకెళ్లి వాటిని జోడించేవారు. పట్టుతప్పిందా ప్రాణాలకు పత్తా ఉండేది కాదు. ఇలా భవన నిర్మాణాల సందర్భంగా
ఎంతోమంది భవన నిర్మాణ కార్మికులు బలయ్యారు. నాటి వారి కష్టాన్ని చూపే వీడియో ఒకటి ఇప్పుడు అందుబాటులోకి వచ్చింది. ఇప్పుడు వీడియో యూట్యూబ్‌లో హల్‌చల్‌ చేస్తోంది. 

మరిన్ని వార్తలు