వైర‌స్ ఫ్రీ దేశంలో కొత్త‌గా రెండు కేసులు

16 Jun, 2020 08:51 IST|Sakshi

వెల్లింగ్టన్‌: కోవిడ్‌ను జయించిన‌ట్లు ప్ర‌క‌టించిన న్యూజిలాండ్‌లో మ‌రోసారి క‌రోనా క‌ల‌క‌లం రేపుతోంది. తాజాగా అక్క‌డ మ‌రో రెండు కేసులు వెలుగు చూడటం ప్ర‌కంప‌న‌లు సృష్టిస్తోంది. న్యూజిలాండ్‌లో మంగ‌ళ‌వారం రెండు కొత్త కేసులు బ‌య‌ట‌ప‌డ్డాయి. యూకే నుంచి వ‌చ్చిన ఇద్ద‌రు వైర‌స్ బారిన ప‌డిన‌ట్లు అక్క‌డి వైద్యాధికారులు ధృవీక‌రించారు. దీంతో అప్ర‌మ‌త్త‌మైన అధికారులు కాంట్రాక్ట్ ట్రేసింగ్‌ను గుర్తించే ప‌నిలో ప‌డ్డారు. (న్యూజిలాండ్‌తో సహా 9 దేశాల్లో జీరో కేసులు)

కాగా క‌రోనాను తాత్కాలికంగానే నిరోధించ‌గ‌లిగామ‌ని, అయితే దేశంలో మ‌ళ్లీ కేసులు బ‌య‌ట‌ప‌డే అవ‌కాశం లేక‌పోలేద‌ని ఆ దేశ ప్ర‌ధాని జెసిండా ఆర్డెర్న్ గ‌తంలోనే వ్యాఖ్యానించిన విష‌యం తెలిసిందే. గ‌త 25 రోజులుగా వేలాది మందికి ప‌రీక్ష‌లు చేయ‌గా ఒక్క కోవిడ్ కేసు కూడా న‌మోద‌వ‌లేదు. యాభై ల‌క్ష‌ల జనాభా ఉన్న న్యూజిలాండ్‌లో ఇప్ప‌టివ‌ర‌కు సుమారు 1500 మంది క‌రోనా బారిన ప‌డ‌గా 22 మంది మ‌ర‌ణించారు. మరోవైపు ప్ర‌పంచ‌వ్యాప్తంగా 81 ల‌క్ష‌ల‌కు పైగా క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయి (న్యూజిలాండ్‌లో కరోనా జీరో)

మరిన్ని వార్తలు