స్టాంపులను సగం చించి వాడేద్దామా!

11 Feb, 2018 02:34 IST|Sakshi

ఓ పోస్టు పంపాలి.. రూ.15 స్టాంపులు కావాలి. కానీ మీ దగ్గర రూ.10 స్టాంపులు రెండు ఉన్నాయి. ఓ రూ.10 స్టాంపును సరిగ్గా సగానికి కత్తిరించి వాడుకోవడం కుదురుతుందా.. ఇక్కడ మాత్రం కుదిరింది. స్టాంపులు మొదలైన తొలి రోజుల్లో వాటి ముద్రణ, వితరణ ఊపందుకోని సమయంలో అమెరికా, బ్రిటన్, జర్మనీ, ఇతర యూరోపియన్, ఆసియా దేశాల్లో దీన్ని అనుమతించారు.

సరిగ్గా కర్ణం (డయాగోనల్‌)లా కత్తిరించిన స్టాంపులు వాటి ముఖ విలువలో సగంగా పరిగణించేవారు. కొన్ని కొన్ని సార్లు మరింత ముందుకెళ్లి మూడు వంతులు, నాలుగు వంతులుగా కూడా కత్తిరించి వాడేవారు. మెక్సికోలో అయితే మూడు, నాలుగు, ఎనిమిది వంతులుగా కత్తిరించి ఉపయోగించేవారు. స్టాంపుల కొరత ఎక్కువగా ఉన్నప్పుడు మాత్రమే దీన్ని అమలు చేశారు. పక్కనున్న ఫొటోలోని పోస్టల్‌ స్టాంపును చూశారుగా..  రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో గురెన్సీ ద్వీపంలో సగానికి కత్తిరించి అతికించి పోస్టు చేశారు..!

మరిన్ని వార్తలు