సోషల్‌ మీడియాతో ఎక్కువ వ్యూస్‌

9 Feb, 2020 09:16 IST|Sakshi

లండన్‌ : సామాజిక మాధ్యమాలైన ఫేస్‌బుక్‌, ట్విటర్‌, గూగుల్‌ వాడకం వల్ల వార్తల వెబ్‌సైట్లకు ఎక్కు వ్యూస్‌ వస్తాయని, ఎక్కువ వెబ్‌సైట్లను దర్శించే అవకాశం ఉంటుందని పరిశోధకులు కనుగొన్నారు. సామాజిక మాధ్యమాల వాడకం ప్రజలు చూసే వార్తల వైవిధ్యంపై ప్రభావం చూసుతుందని ఇప్పటివరకు నమ్మిన మూల సిద్ధాంతానికి పరిశోధకుల తాజా ఫలితం.. వ్యతిరేకంగా ఉంది. ఫేస్‌బుక్‌, గూగుల్‌లను వీక్షించేవాళ్లు ఎక్కువగా వార్తలకు సంబంధించిన అంశాలను చూస్తుంటారని, ఇంటర్నెట్‌లో వార్తల వినియోగానికి సామాజిక వినియోగానికి సామాజిక మాధ్యమాల వాడకం ముఖ్యమైన విధానమని జర్మనీలోని హోహెన్‌హీమ్‌ విశ్వవిద్యాలయానికి చెందిన ఫ్రాంక్‌ మాన్‌గోల్డ్‌ తెలిపారు.

మరిన్ని వార్తలు